Actor Raju Talikote: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:49 PM
ప్రముఖ నటుడు రాజు తలికోటె కన్నుమూశారు. సోమవారం 59 ఏళ్ల వయసులో గుండె పోటు కారణంగా ఆయన మరణించారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రాజు తలికోటె కన్నుమూశారు. సోమవారం 59 ఏళ్ల వయసులో గుండె పోటు కారణంగా ఆయన మరణించారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఉడిపి జిల్లాలోని హెబ్రి ప్రాంతానికి ఆయన వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గుండెపోటుకు గురయ్యారు. షూటింగ్ సిబ్బంది రాజును వెంటనే కస్తుర్బా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం ఆయన కన్నుమూశారు.
దీనిపై కస్తుర్బా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అవినాష్ శెట్టి మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకు వచ్చారు. తలికోటెకు తీవ్రమైన గుండె, శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. ఆస్పత్రిలో చేర్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉండింది. డాక్టర్లు ఆయన్ని బ్రతికించడానికి చాలా ప్రయత్నించారు. తీసుకువచ్చిన వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. అయినా కూడా డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. సాయంత్రం ఆయన మరణించారు’ అని చెప్పారు.
కాగా, రాజు నాటకాల నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 35 సినిమాల్లో ఆయన నటించారు. కామెడీకి పెట్టింది పేరుగా నిలిచారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. బిగ్‌బాస్‌కు కూడా వెళ్లివచ్చారు.
ఇవి కూడా చదవండి
EPFO గుడ్ న్యూస్: 100 శాతం వరకు విత్‌డ్రా..!
వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు