Share News

Kalash thief UPI App: దొంగను పట్టించిన యూపీఐ

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:29 PM

దొంగను పట్టుకోవడంలో పోలీసులకు యూపీఐ సహకరించింది. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న ఓ జైన ఆలయంలో కలశాన్ని దొంగిలించిన భూషణ్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి వంద గ్రాముల బంగారాన్ని, విలువైన రాళ్లు పొదిగిన కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Kalash thief UPI App: దొంగను పట్టించిన యూపీఐ
thief identified by UPI

దొంగను పట్టుకోవడంలో పోలీసులకు యూపీఐ సహకరించింది. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న ఓ జైన ఆలయంలో కలశాన్ని దొంగిలించిన భూషణ్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అరెస్ట్ చేశారు (Jain temple theft). అతడి నుంచి వంద గ్రాముల బంగారాన్ని, విలువైన రాళ్లు పొదిగిన కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైన మతానికి చెందిన ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది (UPI App photo leads to arrest).


చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడికి సంబంధించిన మొత్తం ఫుటేజ్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అమర్చిన కెమెరాతో నిందితుడి స్పష్టమైన ఫోటోను పోలీసులు రూపొందించారు. ఆ ఫొటో ఆధారంగా సోషల్ మీడియా ఖాతాలు, డేటాను పరిశీలించారు. అలాంటి ఫొటోనే నిందితుడు తన యూపీఐ ప్రొఫైల్ ఫొటోగా పెట్టినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. యూపీఐ అకౌంట్ ఆధారంగా నిందితుడి మొబైల్ నెంబర్ తెలుసుకున్నారు. అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది (Jain religion robbery).


ఆ మొబైల్ లోకేషన్‌ను ట్రేస్ చేయగా అది ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఉన్నట్టు బయటపడింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు భూషణ్ వర్మకు గతంలో జువెల్లర్స్ షాప్ ఉండేదని, అతడు జూదానికి బానిసై అంతా కోల్పోయిన తర్వాత దొంగగా మారాడని తేలింది (Gambling addiction crime). జైన మతస్థులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరై దొంగతనాలకు పాల్పడుతున్నట్టు భూషణ్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి..

సింహం vs చిరుత.. పిల్లలను కాపాడుకోవడం కోసం చిరుత ఫైటింగ్ చూశారా?


మీది డేగ చూపు అయితే.. ఈ 6ల మధ్య 9ని 5సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 11 , 2025 | 04:14 PM