Share News

Thar roof stunt video: త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. థార్‌పై నిలబడి వెళ్తుంటే..

ABN , Publish Date - Nov 23 , 2025 | 08:49 PM

ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు, ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అదృష్టం తోడుంటే ప్రాణాలతో తప్పించుకుంటారు.

Thar roof stunt video: త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. థార్‌పై నిలబడి వెళ్తుంటే..
Thar roof stunt video

ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు, ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతుంటారు. అదృష్టం తోడుంటే ప్రాణాలతో తప్పించుకుంటారు. దురదృష్టం వెంటాడితే ఆ సాహసం ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే (boys on Thar accident).


Deadlykalesh అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. హర్యానాలోని నుహ్ రోడ్డులోని కొందరు యువకులు థార్ వాహనంపై ప్రయాణిస్తున్నారు. ముగ్గురు అబ్బాయిలు థార్ వాహనం పై కప్పు మీద నిలబడి ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ వీడియో రూపొందించాలనుకున్నారు. అయితే వారి వాహనానికి హఠాత్తుగా ఓ ట్రక్ ఎదురొచ్చింది. దీంతో థార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లు రూఫ్ పై నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డారు (viral escape).


ఎదురుగా వస్తున్న ట్రక్కు డ్రైవర్ కూడా వెంటనే బ్రేక్ వేశాడు ( risky stunt gone wrong). ఆ ట్రక్కు టైర్ దాదాపు వారికి వెంట్రుక వాసి దూరంలో ఆగిపోయింది. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. 'ఆ అబ్బాయిలు చాలా అదృష్టవంతులు, లేకుంటే ఏదైనా జరిగి ఉండేది' అని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..


ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2025 | 08:49 PM