Jaguar vs Black Panther: నల్ల పులి పైకి దూసుకెళ్లిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:22 PM
సోషల్ మీడియాలో వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జాగ్వర్, బ్లాక్ ఫాంథర్‌ల మధ్య ఫైట్ జరుగుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జాగ్వర్ (Jaguar), బ్లాక్ ఫాంథర్ (Black Panther) మధ్య ఫైట్ జరుగుతోంది.
thebigcatsempire అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఓ దుంగ మీద రెండు బ్లాక్ పాంథర్‌లు ఉన్నాయి. వాటి వెనుక నుంచి ఓ జాగ్వర్ వచ్చింది. మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఓ పాంథర్ మీదకు దూకింది. ఆ పాంథర్ వెంటనే ఆ జాగ్వర్‌పై ఎదురుదాడికి దిగింది. దాదాపు 15 నుంచి 20 సెకన్ల పాటు జరిగిన ఈ ఫైట్‌లో, రెండు జంతువులు తమ పూర్తి బలాన్ని ప్రయోగించాయి. ఈ ఫైటింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. 82 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. బ్లాక్ పాంథర్ చాలా బలమైందని, దాని గోళ్లు చాలా వాడిగా ఉంటాయని ఒకరు పేర్కొన్నారు. బ్లాక్ పాంథర్‌ను ఎదుర్కోవడం సింహానికి కూడా కష్టమైన పనే అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..