Train Food: మీరు ట్రైన్‌లో ఫుడ్ తింటారా? ఈ వీడియో చూస్తే ఇకపై తినడానికి ఆలోచిస్తారేమో..
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:18 PM
మన దేశంలో అత్యధిక మంది రైలు ప్రయాణం చేసేందుకే ఇష్టపడతారు. కొన్ని కోట్ల మంది తమ ప్రయాణాల కోసం రైళ్లనే ఆశ్రయిస్తారు. అయితే రైళ్లలో దొరికే ఆహారం మాత్రం ప్రయాణికుల ఆరోగ్యానికి సవాలు విసురుతుంటుంది.
మన దేశంలో అత్యధిక మంది రైలు ప్రయాణం చేసేందుకే ఇష్టపడతారు. కొన్ని కోట్ల మంది తమ ప్రయాణాల కోసం రైళ్లనే ఆశ్రయిస్తారు. అయితే రైళ్లలో దొరికే ఆహారం మాత్రం ప్రయాణికుల ఆరోగ్యానికి సవాలు విసురుతుంటుంది. రైళ్లలో విక్రయించే ఆహారం తయారు చేయడంలోనూ, నిల్వ చేయడంలోనూ కనీస శుభ్రత పాటించరనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అలాంటి విమర్శలకు బలం చేకూరుస్తూ తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (catering hygiene Indian Railway).
@theskindoctor13 అనే ఎక్స్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆహార పదార్థాలను సరఫరా చేసే డిస్పోజబుల్ కంటైనర్లను వాష్ బేసిన్‌లో కడుగుతున్నారు ( train 16601 viral video). ఈరోడ్-జోగ్బాని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (16601)లో డిస్పోజబుల్ కంటైనర్లను కడిగి తిరిగి ఉపయోగిస్తున్నట్టు ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన వారందరూ ఉలిక్కిపడుతున్నారు. డిస్పోజబుల్ ఫుడ్ కంటెయినర్స్ ఒకసారి తిని పడేసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. రెండోసారి వాడడం చాలా ప్రమాదకరం.
ఈ వీడియో బాగా వైరల్ అయి విమర్శలు రావడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది (IRCTC action). డిస్పోజబుల్ ఫుడ్ కంటెయినర్స్ కడుగుతున్న విక్రేతను గుర్తించి, అతణ్ని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఆ వర్తకుడి లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఆ వర్తకుడికి రూ.5 లక్షలు జరిమానా కూడా విధించినట్లు తెలిపింది. రైళ్లలో ఆహార భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ఐఆర్‌సీటీసీ హామీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..
చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..