Rare cosmic event in 2025: ‘ఇంటర్స్టెల్లార్ 3I/ATLAS’ అంతరిక్షంలో అద్భుత ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:25 AM
శాస్త్రవేత్తలు నిత్యం కొత్త కొత్త టెక్నాలజీతో ఖగోళ శాస్త్ర పరిశోధన అంటే విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల గురించి అధ్యాయనం చేస్తూ ఎన్న రహస్యాలను ఛేదిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక రేడియో టెలీస్కోపులను ఉపయోగిస్తున్నారు.
2025 ఏడాదికి వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఈ ఏడాది అంతరిక్షంలో ఒక అద్భుతాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. జులై1, 2025న చిలీలోని అట్లాస్ (ATLAS) టెలీస్కోప్ ద్వారా మొట్టమొదటిసారిగా ‘ఇంటర్స్టెల్లార్ 3I/ATLAS’ ని గుర్తించారు. 3I/ATLAS అనేది మన సౌర వ్యవస్థ (Interstellar space) వెలుపల నుంచి వచ్చి, ప్రస్తుతం సూర్యుడికి సమీపంగా ప్రయాణిస్తున్న ఒక అరుదైన ఖగోళ వస్తువు. దీనిని ‘నక్షత్రాంతర తోకచుక్క’(Interstellar Comet)గా శాస్త్రవేత్తలు (Scientists)గుర్తించారు. మొదట్లో ఆకాశం గుండా వేగంగా కదులుతున్న ఒక నీలం-ఆకుపచ్చ చుక్కగా కనిపించింది. అయితే, దాని హైపర్బోలిక్ కక్ష్య చూసి అది సుదూర నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చిన ఇంటర్స్టెల్లార్ అని నిర్ధారించారు శాస్త్రవేత్తలు.
మన సౌర వ్యవస్థలోకి వచ్చిన మూడో నక్షత్రాంతపు వస్తువు. అందుకే దీనికి ఇంటర్స్టెల్లార్ 3I (3rd Interstellar)అని పేరు పెట్టారు. దీనికంటే ముందు ‘ఔమువామువ(2017), 2I/బోరిసోవ్ (2019)లు వచ్చాయి. డిసెంబర్ 19న ఇంటర్స్టెల్లార్ 3I/ATLAS అనే నక్షత్రాంతర తోకచుక్క భూమికి అత్యంత సమీప బిందువు వద్దకు(Perigee) చేరుకుంది. ఇది భూమికి సుమారు 269 మిలియన్ కిలోమీటర్ల (సుమారు 1.8 AU)దూరంలో ప్రయాణించింది. అంటే ఇది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం కన్నా దాదాపు రెండింతలు. కాబట్టి భూమికి ఎలాంటి ప్రమాదం కలగలేదని సైంటిస్టులు చెబుతున్నారు.
గ్యాస్ జెట్స్ అంటే సూర్యుడి వేడి వల్ల ఈ తొక చుక్క లోపల ఉన్న వాయువులు, ధూళి ఒక్కసారిగా బయటకు రావడం (Outgassing) కనిపించింది. సూర్యుడిని సమీపిస్తున్నా కొద్ది వేగాన్ని స్వల్పంగా మార్చింది. దీని కేంద్రకం (Nucleus) ఎంతో దృఢంగా ఉందని, ఇతర గెలాక్సీల నుంచి వచ్చిన శక్తివంతమైన శిలాల మిశ్రమం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిసెంబర్ 19న భూమిని దాటిన ఇంటర్స్టెల్లార్ 3I/ATLAS ప్రస్తుతం సూర్యుడి వైపు అత్యంత వేగంగా దూసుకువెళ్తుంది.
2026 జనవరి నాటికి సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లనుంది. ఆ తర్వాత మన సౌర వ్యవస్థ నుండి శాశ్వతంగా బయటకు వెళ్లిపోయి.. ఎప్పటికీ తిరిరాదని పరిశోధకులు అంటున్నారు. అది ఎటు మాయం అవుతుందన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. భూమికి సమీపంలో ప్రయాణించినప్పుడు దీని చుట్టు ఉనన ఆవరణం(Coma) ముదురు ఆకుపచ్చ, నీలం రంగు మిశ్రమంతో ఎంతో ఆకర్షణగా మెరిసిందని ఖగోళ ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Underwater Train: 2 గంటల్లోనే ముంబయి టు దుబాయ్.. త్వరలోనే సాకారం.!
PESA Mahotsav Begins in Vizag: విశాఖలో ప్రారంభమైన పెసా మహోత్సవం