Tiger vs crocodile: నది ఒడ్డుకు వెళ్లిన పెద్దపులి.. నీరు తాగేలోపు షాకింగ్ అనుభవం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:55 PM
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అత్యంత బలమైన ఏనుగు కూడా నీటలోని మొసలికి చిక్కితే ప్రాణాల కోసం పోరాడాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అత్యంత బలమైన ఏనుగు కూడా నీటలోని మొసలికి చిక్కితే ప్రాణాల కోసం పోరాడాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. తాజాగా ఓ పెద్ద పులికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(Crocodile attacks Tiger).
@Saket_Badola అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లోని ధికాలా జోన్‌లోని రామ్‌గంగా నది సమీపంలో చిత్రీకరించారు. నదిలోని నీటిని తాగడానికి ఓ పెద్ద పులి వెళ్లింది. ఆ పులి నీటి దగ్గరకు వెళ్లగానే లోపల ఉన్న మొసలి అకస్మాత్తుగా దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే పులి మెరుపు వేగంతో స్పందించి తనను తాను రక్షించుకుంది. అక్కడి నుంచి పరుగులు పెట్టింది(River Predator Attack).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (deadly wildlife encounter). వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అడవిలో చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని ఒకరు కామెంట్ చేశారు. అడవిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండడమే ప్రాణాలను కాపాడుతుందని మరొకరు పేర్కొన్నారు. అడవిలో ప్రతి అడుగు ప్రమాదకరమేనని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..