Lion Video: ఒళ్లు జలదరించే వీడియో.. చిన్నారి బాలికను సింహం ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:04 PM
వన్య ప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఇటీవలి కాలంలో పులులు, సింహాలు వంటి క్రూరమృగాలను పెంచుకోవడం చాలా మందికి స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. వాటిని తమ ఇళ్లలోనే ఉంచుకుంటూ పెంపుడు జంతువుల్లా భావిస్తున్నారు.
వన్య ప్రాణులు (Wild Animals) ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. జంతువుల మానసిక స్థితి ఎప్పుడైనా మారవచ్చు. వాటి తీరును మనుషులు ఎల్లవేళలా సరిగ్గా అంచనా వేయలేరు. అందుకే వన్య ప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఇటీవలి కాలంలో పులులు (Pet Tigers), సింహాలు (Pet Lions) వంటి క్రూరమృగాలను పెంచుకోవడం చాలా మందికి స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. వాటిని తమ ఇళ్లలోనే ఉంచుకుంటూ పెంపుడు జంతువుల్లా భావిస్తున్నారు.
పులులు, సింహాలు వంటి వన్య ప్రాణులతో అప్రమత్తంగా ఉండకపోతే ఏం జరుగుతుందో తాజా వీడియో (Viral Video) కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. tahacomandox అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బాలిక తన తల్లి ఒడిలో కూర్చుని ఉంది. కేర్ టేకర్ పర్యవేక్షణలో ఉన్న ఓ పెంపుడు సింహం ఆ బాలికపై దాడికి దిగింది. ఆ బాలిక కాలు పట్టుకుని కొరికేసేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడున్న కేర్ టేకర్, మహిళలు ఇద్దరూ ఆ బాలికను సింహం నుంచి కాపాడారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు. 81 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోలోని వ్యక్తులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తల్లి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, అదృష్టవశాత్తూ ఆ బాలిక ప్రాణాలతో బయటపడిందని ఒకరు కామెంట్ చేశారు. వన్య ప్రాణులను ఎప్పుడూ నమ్మకూడదని మరొకరు సూచించారు. పిల్లలను జంతువుల నుంచి దూరంగా ఉంచాలని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈమె పురుష ప్రపంచాన్నే భయపెడుతోంది.. ఉంగరాల ఆటలో ఆమె ఏం చేసిందంటే..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలోని రెండు తప్పులను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..