Share News

Viral Post: ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు లక్ష్మీ కటాక్షం.. పాపం అంతలోనే..

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:05 AM

దీపావళి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ఓ గృహిణి ఇంటిని శుభ్రం చేసే పనిలో పడింది. ఇల్లంతా శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్ డబ్బా కనబడింది. ఇంతకీ ఇది ఏం డబ్బా? ఇందులో ఏముంది? అనే అనుమానంతో ఆ డబ్బాను తెరచి చూసింది. అందులో డబ్బును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

Viral Post: ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు లక్ష్మీ కటాక్షం.. పాపం అంతలోనే..
Women Viral Post

ప్రతియేటా దీపావళి పర్వదిన సమయంలో ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇంట్లో అటక, లేదా సజ్జమీద ఉన్న వస్తువులన్నీ తీసి బూజు దులిపి.. ఇంటిని నీటితో శుభ్రంగా కడుగుతారు. ఏడాది పొడవునా దాచిపెట్టిన వస్తువులను శుభ్రం చేసుకుంటారు. ఇంటికి సున్నం వేసుకోవడం, పెద్ద పెద్ద భవంతులు అయితే కొత్తగా పెయింట్ వేసుకుంటారు. ఏడాది పొడవునా ఎప్పుడు ఇంటిని శుభ్రం చేయకపోయినా దీపావళికి ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటారు. శుచి, శుభ్రత ఉన్నచోటే లక్ష్మీ దేవి ఉంటుందని ప్రజల నమ్మకం. అందుకే దీపావళి పండుగ సమయంలో ఇంటిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి, లక్ష్మిదేవికి ఘనంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారికి సమర్పించిన పదార్థాన్ని ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకొని కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా ఉంటారు.


దీపావళి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ఓ గృహిణి ఇంటిని శుభ్రం చేసే పనిలో పడింది. ఇల్లంతా శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్ డబ్బా కనబడింది. ఇంతకీ ఇది ఏం డబ్బా? ఇందులో ఏముంది? అనే అనుమానంతో ఆ డబ్బాను తెరచి చూసింది. అందులో డబ్బును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. డబ్బాలో నుంచి కరెన్సీ నోట్లను తీసి లెక్కించింది. మొత్తం రెండు లక్షలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. అయితే క్షణాల్లో ఆమె కళ్ళల్లో కనిపించిన ఆనందం అంతలోనే మాయమైంది. అవి రూ.2 వేల నోట్లు కావడంతో ఏమి చేయాలో అని ఆలోచించసాగింది. అంత డబ్బును తన భర్తే అందులో పెట్టి ఉంటాడని సదరు మహిళా తెలిపింది. డబ్బు దొరికిందని సంతోష పడాలో, రూ.2 వేల నోట్లు దొరికినందుకు బాధ పడాలో ఎటూ తెలియక అయోమయంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ఈ డబ్బులతో తాను ఎంపీ చేయాలో చెప్పండి ప్లీజ్ అని అడగగా.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దేవుడా..రూ. 2 లక్షల రూపాయలు డబ్బాలో పెట్టి మర్చిపోయేంత డబ్బు నాకూ ఇవ్వండి అని ఫన్నీ కామెంట్ చేశారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఇంత డబ్బు ఉంచుకున్న తర్వాత ఎవరైనా ఎలా మర్చిపోగలరు? అని ప్రశ్నించారు. ఈ చెల్లని రూ.2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాకు పంపించి మీ డబ్బును తిరిగీ పొందండి అని మరో యూజర్ సూచించారు. దీపావళి వేళా ఆ మహిళకు లక్ష్మీ కటాక్షం లభించిందని నవ్వుతూ కామెంట్ చేశారు.

Updated Date - Oct 14 , 2025 | 11:05 AM