History of Valentine's Day: 'ప్రేమికుల దినోత్సవం' చరిత్ర తెలిస్తే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి..
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:17 PM
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే, 'వాలెంటైన్స్ డే' చరిత్ర మీకు తెలుసా? ఈ రోజు వెనుక ఉన్న బాధాకరమైన కథ మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Valentine's Day: ఫిబ్రవరి 14 అంటే 'వాలెంటైన్స్ డే'. లవర్స్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఈ డేను ఎంతో స్పేషల్‌గా జరుపుకుంటారు. ఒకప్పుడు 'ప్రేమికుల దినోత్సవం' క్రైస్తవ మతపరమైన పండుగగా జరుపుకునేవారు. తరువాత ఇది నెమ్మదిగా వివిధ దేశాలలో ప్రేమ, ఆప్యాయతలకు సాంస్కృతిక, మతపరమైన పండుగగా మారింది. అయితే, 'వాలెంటైన్స్ డే' ఎలా మొదలైందో మీకు తెలుసా? ఈ రోజు వెనుక ఉన్న బాధాకరమైన కథ మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
'వాలెంటైన్స్ డే' ఎలా మొదలైంది?
మూడవ శతాబ్దంలో క్లాడియస్ చక్రవర్తి రోమన్లందరిని పన్నెండు మంది దేవుళ్లను పూజించాలని ఆదేశించాడు. ఆ సమయంలో క్రైస్తవ మతాన్ని బోధించడం నిషేధం. క్రైస్తవులతో సంభాషించినా కూడా మరణశిక్ష విధించేవారు. అలాంటి సమయంలో సెయింట్ వాలెంటైన్ అనే పూజారి క్రైస్తవ మతాన్ని బోధించడం ప్రారంభించాడు. అప్పటి రోమన్ చక్రవర్తి క్లాడియస్, వాలెంటైన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో అతన్ని జైలులో పెట్టాడు. వాలెంటైన్‌కు చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించి జైలులో వేయించాడు.
జైల్లో ఉన్నప్పట్టికీ
జైలులో ఉన్నప్పుడు కూడా సెయింట్ వాలెంటైన్ మంచి పనులు చేస్తూ ఉండేవాడు. అక్కడ ఒక జైలర్ అంధ కుమార్తెను స్వస్థపరిచాడు. జైల్లో ఉన్నప్పట్టికీ వాలెంటైన్‌కు ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే జైలర్ కుమార్తె జూలియా వాలెంటైన్‌తో ప్రేమలో పడిందని చెబుతారు. ఆమె వాలెంటైన్‌ను కలవాలని, ఒకసారి చూడాలని అనుకుంటుంది.
జూలియా అతన్ని చూడటానికి జైలుకు వెళ్ళింది. కానీ, ఆమె అతన్ని చూడలేకపోయింది. అప్పటికే, క్రూరమైన చక్రవర్తి అతనికి మరణశిక్ష విధించాడు. ఆయన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను జైలు అధికారు ఉరితీశారు. తను ప్రేమించిన వాడు చనిపోయాడని తెలుసుకున్న జూలియా సెయింట్ వాలెంటైన్ సమాధి దగ్గరకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రేమించిన వాడిని ఒక్కసారి కూడా చూడలేకపోయింది. ప్రతిరోజూ వాలెంటైన్ సమాధి దగ్గర గులాబీలు పెట్టి కాసేపు అక్కడే ఉండేది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అతని మరణ జ్ఞాపకార్థంగా ఈ రోజును వాలెంటైన్స్ డేగా జరుపుకుంటున్నారు.
Also Read: అలాంటి స్నేహితుడు పాము కంటే ప్రమాదకరం.. వాళ్లను నమ్మితే అంతే..