Friendship: మీ ఫ్రెండ్‌కు ఇలా కూడా సహాయం చేయవచ్చు..
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:08 PM
నిరుద్యోగం ఆర్థిక సమస్యలను తెస్తుంది. మీ స్నేహితుల్లో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? మీరు డబ్బు సహాయం చేయలేకపోయినా పర్వలేదు కానీ ఇలా సహాయం చేయడం ముఖ్యం.
నిరుద్యోగం ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో కొన్ని రంగాల్లో చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. సడెన్‌గా చేస్తున్న ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం వెతుకున్నే వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి మాత్రమే కాకుండా, తనను నమ్ముకున్న కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, అలాంటి పరిస్థితిని మీ స్నేహితుల్లో ఎవరైనా ఎదుర్కొంటున్నప్పుడు మీరు వారికి సహాయం చేయడం ముఖ్యం.
ఎలా సహాయం చేయాలి:
నిరుద్యోగిగా ఉన్న మీ స్నేహితుడికి డబ్బు సహాయం చేయలేకపోయినా మాట సహాయం చేసిన చాలు. మీ మద్దతు కష్ట సమయాల్లో వారిని మరింత దృఢంగా చేయగలదు. ఆనందంగా ఉన్న సందర్భాల్లో మీరు మీ స్నేహితుడితో లేకపోయినా పర్వలేదు కానీ వారి కష్టసమయాల్లో మీరు తోడుగా ఉండటం చాలా ముఖ్యం. మీ చిన్న ప్రయత్నం వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు.
1. భావోద్వేగాలను అర్థం చేసుకోండి:
ముందుగా వారి సమస్యలను అర్థం చేసుకోండి. వారు చెప్పిన దానిపై తీర్పు చెప్పకుండా, మీరు వారితో ఉన్నారనే ధైర్యం ఇవ్వాలి. ఇది వారికి పెద్ద సహాయం కావచ్చు.
2. ఒత్తిడి చేయవద్దు:
నిరుద్యోగంలో ఉన్న స్నేహితుడికి ఇది తాత్కాలిక పరిస్థితి అని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పండి, కానీ ఒత్తిడి చేయవద్దు. కష్ట సమయాలను ఎదుర్కొని ముందుకు సాగిన విజయవంతమైన వ్యక్తుల కథలను చెప్పండి. వారిపై ఎలాంటి అవాంఛనీయ ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. ఉద్యోగ అవకాశాలు చర్చించండి:
వారితో ఉద్యోగ అవకాశాల గురించి చర్చించండి. రెజ్యూమ్‌లను రూపొందించడంలో వారికి సహాయపడండి. జాబ్ పోర్టల్‌లలో ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేయడానికి వారిని ప్రేరేపించండి. వారి నైపుణ్యాల ఆధారంగా కొత్త అవకాశాలను గుర్తించడంలో వారికి సహాయపడండి.
4. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి..
నేటి కాలంలో, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. వారు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే ఆన్‌లైన్ కోర్సుల గురించి చెప్పండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
5. సమయం గడపండి:
నిరుద్యోగంతో డిప్రెషన్, ఒంటరితనం పెరుగుతుంది. ఆ సమయంలో వారితో సమయం గడపండి. వారికి సంతోషాన్ని కలిగించే పని చేయండి.
6.ఆరోగ్య నిపుణుడి సలహా
మీరు ఎంత సర్థి చెప్పినా కూడా వారి టెన్షన్ పెరుగుతోందని మీకు అనిపిస్తే, ఒక మానసిక ఆరోగ్య నిపుణుడి నుండి సలహా పొందమని చెప్పండి. ఇది వారి మానసిక స్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది.