Share News

Funny Video: పాపం.. ఈ వరుడు చాలా అమాయకుడిలా ఉన్నాడే.. భార్యకు పువ్వు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడంటే..

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:16 PM

వధూవరులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వరుడి తీరు చూస్తే నవ్వు రాకమానదు. అతడు అంత అమాయకుడేంటి అనిపించకమానదు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Funny Video: పాపం.. ఈ వరుడు చాలా అమాయకుడిలా ఉన్నాడే.. భార్యకు పువ్వు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడంటే..
Bride and Groom

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌లో (wedding) వధూవరులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు (funny video) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వరుడి (Groom) తీరు చూస్తే నవ్వు రాకమానదు. అతడు అంత అమాయకుడేంటి అనిపించకమానదు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


vicky_kumar_8908 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వేదికపై వధూవరులు ఉన్నారు. వధువుకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలని వరుడికి అతడి స్నేహితులు సూచించారు. ఎలా ప్రపోజ్ చేయాలో ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని చూపిస్తున్నాడు. అయినా వరుడు మాత్రం అలా చేయలేకపోతున్నాడు. మోకాళ్ల మీద కూర్చోవడానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు నిలబడే వధువు చేతికి గులాబీ ఇచ్చేశాడు. అప్‌సెట్ అయిన వధువు దానిని తీసుకుంది.


ఆ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వరుడు ప్రస్తుత ప్రపంచంలో ఉండాల్సిన వాడు కాదు అని ఒకరు కామెంట్ చేశారు. అతడు చాలా అమాయకుడిలా ఉన్నాడు అని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ గదిలో మొబైల్ ఎక్కడుందో 5 సెకెన్లలో వెతికిపెట్టండి


Stunt with Dolphins: వామ్మో.. ఇదెక్కడి స్టంట్ రా బాబూ.. డాల్ఫిన్లతో కూడా ఇలా చేస్తారా



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 06:16 PM