Share News

Man Catches Wife Cheating: హోటల్‌‌లో ప్రియుడితో మహిళ.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి..

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:04 PM

తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్న సమయంలో భర్త వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రాకేశ్ అనే వ్యక్తి హోటల్‌లోకి ప్రవేశిస్తున్నాడు. అయితే..

Man Catches Wife Cheating: హోటల్‌‌లో ప్రియుడితో మహిళ.. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి..
Haryana hotel incident

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమై కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. క్రైమ్‌రేట్ పెరగడానికి కారణమవుతున్నాయి. వివాహితులు వేరే వ్యక్తితో ప్రేమలో పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Haryana hotel incident).


తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్న సమయంలో భర్త వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (hotel room drama). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రాకేశ్ అనే వ్యక్తి హోటల్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 'నా జీవితం నాశనం అయింది' అని చెబుతున్నాడు. కొంతమంది వ్యక్తులతో అతను హోటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్లాడు. గది నంబర్ అడిగి పైకి వెళ్లాడు. తన భార్య ఉన్న హోటల్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు తెరిచే వరకు పదే పదే కొట్టాడు. డోర్ తెరిచిన తర్వాత లోపల అతని భార్య మరొక వ్యక్తితో కనిపించింది (cheating spouse caught).


తీవ్ర ఆగ్రహానికి గురైన రాకేశ్ లైట్లు వేసి లోపల ఏం జరుగుతోందో అందరికీ చూపించాడు (hotel scandal India). రాకేశ్ తన భార్యతో ఉన్న వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే తన ప్రియుడిని కొట్టకుండా రాకేశ్‌ను అతడి భార్య అడ్డుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ జనరేషన్‌లో పెళ్లి అనే బంధానికి విలువే లేకుండా పోతోంది అని ఒకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..

ఈ ఫొటోలో చిలుక మాత్రమే కాదు.. బాటిల్ కూడా ఉంది.. 6 సెకెన్లలో కనిపెట్టండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2025 | 06:47 PM