Groom rejects dowry: కట్నం వద్దన్నందుకు వరుడిపై కోపం.. పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:22 PM
ప్రజలు సాంప్రదాయ, ప్రాచీన ఆచారాలను వదిలి ముందుకు సాగుతుండగా, మరోవైపు కొందరు వాటిని అధిగమించలేకపోతున్నారు. వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు ఇప్పటికీ సమాజంలో ప్రబలంగా ఉన్నాయి. కట్నం ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు.
ప్రజలు సాంప్రదాయ, ప్రాచీన ఆచారాలను వదిలి ముందుకు సాగుతుండగా, మరోవైపు కొందరు వాటిని అధిగమించలేకపోతున్నారు. వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు ఇప్పటికీ సమాజంలో ప్రబలంగా ఉన్నాయి. కట్నం ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కేసు చాలా విచిత్రమైనది. కట్నం తీసుకోనని వరుడు చెప్పినందుకు కాబోయే మామగారికి కోపం వచ్చింది. పెళ్లి రద్దయిపోయింది (Dowry refusal).
ఈ మొత్తం కథను రెడ్డిట్‌లో r/ThirtiesIndia అనే హ్యాండిల్ ద్వారా ఓ యూజర్ వివరించారు. తన కజిన్ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలిపారు. 'నా కజిన్ మంచి ఆస్థిపరుడు. అతడి తల్లిదండ్రులకు రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు, పబ్బులు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి కూడా ఉంది. అతడు చూడడానికి అందంగా ఉంటాడు. అతడు పెద్దలు కుదిర్చిన వివాహానికి అంగీకరించాడు. అతడి తల్లిదండ్రులు బాగా చదువుకున్న, మంచి కుటుంబ విలువలు కలిగిన అమ్మాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. చర్చల తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి' అని పేర్కొన్నారు (wedding cancelled over dowry).
'అప్పుడు అమ్మాయి తండ్రి నా కజిన్‌ను కట్నం గురించి అడిగాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. దానికి నా కజిన్ తనకు ఏదీ వద్దన్నాడు. అయితే వధువు తండ్రి రేంజ్ రోవర్ కారు లేదా డ్యూప్లెక్స్ ఫ్లాట్ లాంటి బహుమతి తీసుకోవాలని కోరాడు. అందుకు నా కజిన్ అంగీకరించలేదు. కొంత సేపు వాదించిన వధువు తండ్రి చివరకు పెళ్లి రద్దు చేశాడు' అని సదరు యూజర్ తెలిపారు. 'ఒక ధనవంతుడికి తన విలువ బాగా తెలిసి ఉండాలి. అతడు బహుమతి నిరాకరిస్తున్నాడంటే అతడిలో ఏదో లోపం ఉండి ఉండాలి' అని వధువు తండ్రి భావించి పెళ్లి క్యాన్సిల్ చేశాడట.
ఇవి కూడా చదవండి..
వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. సీతాకోకచిలుకల మధ్యన చీమను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..