Heartwarming Viral Video: తారులో చిక్కి విలవిల్లాడిన కుక్క.. దేవుళ్లలా వచ్చి..
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:47 AM
ఓ కుక్క రోడ్డుపై పడ్డ తారులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక అల్లాడిపోయింది. ఆ రోడ్డుపై వెళుతున్న కొంతమంది దానికి సాయం చేశారు. అతికష్టం మీద దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. కొంతమంది మనుషులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది తోటి మనుషులతో పాటు మూగ జీవాలతో కూడా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తమ సంతోషం కోసం మూగ జీవాల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అయితే, కొన్ని సంఘటనలు మాత్రం మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నాయి. ఇందుకు తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ కుక్క తారులో చిక్కుకుపోయింది.
బయటకు రాలే గిలగిల్లాడిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు దానికి సాయం చేశారు. ఎంతో శ్రమించి దాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన ఈక్వెడార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ తారు ట్యాంకర్ క్విటోలోని కొండ ప్రాంతంలో వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మలుపు దగ్గర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బోల్తాపడింది. ట్యాంకర్‌లోని తారు రోడ్డుపై పడిపోయింది. ఆ తారు గురించి అవగాహన లేని కుక్క పరిగెత్తుకుంటూ అందులోకి వెళ్లింది.
తారులో చిక్కుకుపోయింది. బయటకు రావటానికి ఎంతో ప్రయత్నించింది. దాని వల్ల కాలేదు. బయటకు రాలేక విలవిల్లాడిపోయింది. అటు వైపు వెళుతున్న కొంతమంది వాహనదారులతో పాటు రెస్క్యూ సిబ్బంది తారులో చిక్కుకున్న కుక్కను బయటకు తీసుకురావటానికి చాలా శ్రమించారు. ఎంతో కష్టం మీద కుక్కను పక్కకు తీశారు. కుక్కకు అంటుకున్న తారు క్లీన్ చేయడానికి రెస్క్యూ సిబ్బంది దాన్ని అక్కడినుంచి తీసుకుపోయారు. ఎర్సిన్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ ముద్దు ముచ్చట