Share News

Girl's Strange Hobby: యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:37 PM

దోమల్ని చంపి పేపర్ పై అతకు పెట్టే వింత హాబీ ఉన్న యువతి వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. వీడియో చూసిన జనాలు తమకు ఇది రోత పుట్టిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.

Girl's Strange Hobby: యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి
Girl's Strange Hobby

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట వింతలూ వినోదాలకు కొదవే లేదు. కొన్ని ఆశ్చరపరిస్తే కొన్ని రోత పుట్టిస్తాయి. మరికొన్నింటికి చూస్తే ప్రపంచం ఎటు పోతోందో అనే సందేహం కలుగుతుంది. ప్రస్తుతం ఓ యువతిని చూసి నెటిజన్లు అసలేమీ అర్థం కాక తలబాదుకుంటున్నారు. ఇలా ఎందుకు తయ్యారయ్యావంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆకాంక్ష రావత్ అనే యువతి ఇన్‌స్టాలో మరో యువతికున్న వింత హాబీ గురించి ఓ వీడియో షేర్ చేసింది. జనాలకు వింత హాబీలు సహజమే కానీ ఇలాంటిది మాత్రం ఎక్కడా చూడలేదంటూ ఆకాంక్ష ఈ వీడియో షేర్ చేసింది. వీడియోలోని యువతి రెడీ చేసిన ఓ పేపర్‌ను ఆకాంక్ష చూపించింది.


సదరు యువతి ఆ పేపర్‌పై చచ్చిన దోమల్ని టేపుతో అంటించింది. ఒక్కో దోమకు పేరు పెట్టి దాన్ని ఎక్కడ చంపిందీ కూడా రాసుకొచ్చింది. రామేశ్, బబ్లీ, టింకూ ఇలాంటి దోమలకు మనుషుల పేర్లు పెట్టింది. అంతేకాకుండా అవి ఆడవో మగవో కూడా రాసుకొచ్చింది. తన హాబీ గురించి ఆకాంక్ష చెబుతుంటే ఆ యువతి సంబరం పట్టలేకపోయింది. కెమెరా వంక చూస్తూ తెగ నవ్వింది.

ఇక ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఏకంగా 8 మిలియన్‌ల వ్యూ్స్ వచ్చాయి. జనాలు కూడా తమ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. అనేక మంది యువతి తీరును విమర్శించారు. ఆమె హాబీ రోత పుట్టేలా ఉందని అన్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ మరికొందరు ప్రశ్నించారు. యువతి తీరుకు మొత్తం దోమల సమాజం వణికిపోతోందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. రక్తం తాగే దోమలన్నీ ఆడ దోమలే అయినప్పుడు పేపర్‌పై మగ దోమలు ఎలా వచ్చాయని కొందరు లాజికల్‌ ప్రశ్న వేశారు.


అవి ఆడ దోమలైనా కావాలనే మగ దోమలుగా చూపించింది. మగాళ్లంటే అందరికీ చులకనే అని మరో వ్యక్తి సెటైర్ పేల్చారు. అసలైన్ డెత్ నోట్స్ అంటే ఇదే అని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. మరి జాల్ని ఇంతగా ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 13 , 2025 | 04:37 PM