Girls Fight Over Boyfriend: బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిల మధ్య గొడవ.. నడి రోడ్డులో దారుణంగా..
ABN , Publish Date - Dec 30 , 2025 | 02:53 PM
ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు. ఓ అమ్మాయిపై మరో అమ్మాయి దాడి చేసింది. నడిరోడ్డులో చావ చితకబాదింది. తన బాయ్ ఫ్రెండ్‌ను బాబు అని పిలిచినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది.
అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవపడ్డం అన్నది సర్వ సాధారణంగా జరుగుతూ ఉండేదే. ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించి, గొడవపడ్డ సంఘటనలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి. అయితే, అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అబ్బాయిల కోసం అమ్మాయిలు గొడవపడుతూ ఉంటారు. తాజాగా, ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు. ఓ అమ్మాయిపై మరో అమ్మాయి దాడి చేసింది. నడిరోడ్డులో చావ చితకబాదింది. తన బాయ్ ఫ్రెండ్‌ను బాబు అని పిలిచినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ అమ్మాయి, అభిషేక్ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. ఏవో కారణాల వల్ల ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. దీంతో అభిషేక్ వేరే అమ్మాయిని ప్రేమించాడు. ఇలాంటి సమయంలో మాజీ ప్రియురాలు మళ్లీ అతడితో క్లోజ్‌గా ఉండటం మొదలెట్టింది. అభిషేక్‌ను బాబు అని ప్రేమగా పిలవసాగింది. ఈ విషయం కొత్త ప్రియురాలికి తెలిసింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. యశోదా నగర్ బైపాస్ వద్ద రాత్రి వేళ అభిషేక్ కొత్త ప్రియురాలు.. మాజీ ప్రియురాలితో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది.
అభిషేక్ మాజీ ప్రియురాలిపై వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి(కొత్త ప్రియురాలు) విచక్షణా రహితంగా దాడి చేసింది. నడిరోడ్డులో చాలా దారుణంగా కొట్టింది. ‘నువ్వు అభిషేక్‌ను వదిలేశావు. ఇప్పుడు అతడు నావాడు. నువ్వు అతడ్ని బాబు అని పిలుస్తావా? బాబు అని పిలుస్తావా?’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నార్మల్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇక, ఈ వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఇద్దరమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలను రోడ్డు మీదకు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..
హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప