Share News

Girl jumps from school building: షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్లి స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకేసిన బాలిక..

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:10 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురాలో దారుణం చోట చేసుకుంది. ఓ పాఠశాలలో చదువుతున్న బాలిక చేసిన పని ఎంతో మందిని నివ్వెరపరుస్తోంది. చక్కగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ బాలిక అకస్మాత్తుగా చేసిన పని షాకింగ్‌గా మారింది. సీసీటీవీ కెమేరాలో రికార్డు అయిన ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Girl jumps from school building: షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్లి స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకేసిన బాలిక..
Girl jumps from school building

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురాలో దారుణం చోట చేసుకుంది. ఓ పాఠశాలలో చదువుతున్న బాలిక (School Girl) చేసిన పని ఎంతో మందిని నివ్వెరపరుస్తోంది. చక్కగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ బాలిక అకస్మాత్తుగా చేసిన పని షాకింగ్‌గా మారింది. సీసీటీవీ కెమేరాలో రికార్డు అయిన ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవరంగ్‌పురా ప్రాంతంలోని సోమ్ లలిత్ ప్రైవేట్‌ స్కూల్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది (Girl jumps from school building).


సోమ్ లలిత్ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్న పదిహేనేళ్ల బాలిక గురువారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో బిల్డింగ్ నాలుగో అంతస్థు కారిడార్‌లో నడుస్తోంది. చేతితో తాళాలు పట్టుకుని సరదాగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అంతలోనే ఆమె రైలింగ్ ఎక్కి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులందరూ కేకలు వేసుకుంటూ పరుగులు పెట్టారు. నాలుగో అంతస్థు నుంచి దూకడంతో ఆ బాలిక తలకు బలమైన గాయమైంది. శరీరంలో పలు చోట్ల ఎముకలు విరిగిపోయాయి.


బాలికను పాఠశాల యాజమాన్యం సమీప హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు తరలించారు. ఆ హాస్పిటల్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. ఆ బాలిక తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2025 | 04:42 PM