Girl Driving Scooty: వామ్మో.. ఈ అమ్మాయికేమైంది.. స్కూటీ నడిపే తీరు చూస్తే దడుసుకోవాల్సిందే
ABN , Publish Date - May 15 , 2025 | 03:09 PM
ప్రస్తుతం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా బైక్‌లు, స్కూటీలను కూడా నడపుతున్నారు. అయితే అమ్మాయిలు బైక్ నడిపే తీరు మాత్రం అప్పుడప్పుడు వివాదాస్పదమవుతోంది. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే బైక్‌లను నడిపేవారు. ప్రస్తుతం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా బైక్‌లు, స్కూటీలను కూడా నడపుతున్నారు (Scooty Driving). అయితే అమ్మాయిలు బైక్ నడిపే తీరు మాత్రం అప్పుడప్పుడు వివాదాస్పదమవుతోంది. సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకోకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బైక్‌లను నడిపి వారు చేస్తున్న యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
paagalworldfull అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బిజీ రోడ్డు మీద ఓ యువతి స్కూటీ నడుపుకుంటూ వెళ్తోంది. అయితే ఆ అమ్మాయి రోడ్డు మీద బైక్‌తో స్టంట్స్ చేస్తోంది. స్కూటీనీ ప్రమాదకరంగా ఇటూ అటూ తిప్పుతూ వెళ్తోంది. చాలా వేగంగా స్కూటీ నడుపుతూ ఎవరినీ ఢీకొట్టకుండా నడుపుతోంది. వెనుక వస్తున్న ఓ వ్యక్తి ఆ అమ్మాయి డ్రైవింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.2 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ స్కూటీ నడుపుతోంది నిజంగా అమ్మాయేనా అంటూ ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు. చివరకు ఆమె ఎక్కడో దగ్గర పడిపోవడం ఖాయం అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు.. కార్‌తో జీరో కట్ ఎలా కొట్టాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే
Jugaad Video: ఇది విక్రాంత్ 2.0 బీహార్ మోడల్.. వీరి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..