Girl Smart Brain: ఈ అక్క తెలివికి సలాం చెప్పాల్సిందే.. జుట్టును ఎలా ఆరబెడుతోందో చూడండి..
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:46 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, జుగాడ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, జుగాడ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి. తెలివిగా ఆలోచించి సులభంగా పనులు పూర్తి చేసుకునే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@kangrekom అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అమ్మాయి తన జుట్టును ఆరబెట్టుకుంటోంది. సాధారణంగా అమ్మాయిలు హెయిర్ డ్రయర్‌తో జుట్టును ఆరబెడతారు. కానీ ఈ అమ్మాయి ఒక చిన్న స్టాండ్ ఫ్యాన్‌తో తన జుట్టును ఆరబెడుతోంది. ఇంట్లో హెయిర్ డ్రయర్ లేకపోవడంతో స్టాండ్ ఫ్యాన్‌ను ఆన్ చేసి జట్టుపై పెట్టుకుని అన్ని వైపులా తిప్పుతూ ఆరబెట్టుకుంటోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Girl drying hair fan).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా వీక్షించారు (Life Hack Video). 22 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. వావ్.. ఆమెకు ఫ్యాన్ అయిపోయానని ఒకరు కామెంట్ చేశారు. హెయిర్ డ్రయర్ అల్ట్రా ప్రో మాక్స్ అని మరొకరు కామెంట్ చేశారు. అక్కా.. నీ పాదాలకు దండం పెట్టాలని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..