Viral beauty trend: సొట్ట బుగ్గల కోసం ఇంత రిస్క్ అవసరమా? ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:54 PM
ఇటీవలి కాలంలో చాలా మంది తమ అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. మోడళ్లు, సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు.. సాధారణ యువతీ యువకులు కూడా కాస్మొటిక్ సర్జన్లను ఆశ్రయించి తమకు నచ్చిన విధంగా మారిపోతున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది తమ అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. మోడళ్లు, సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు.. సాధారణ యువతీ యువకులు కూడా కాస్మొటిక్ సర్జన్లను ఆశ్రయించి తమకు నచ్చిన విధంగా మారిపోతున్నారు. తనకు సహజంగానే లేని సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి విచిత్రమైన పనిచేసింది (Artificial dimples).
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి తన బుగ్గలు సొట్టపడేలా ఉండడం కోసం ప్రత్యేక విధానాన్ని ఆశ్రయించింది. సన్నని తీగ సహాయంతో ఆమె నోటి లోపల ఆ గుంటను సృష్టించారు. ఆ అమ్మాయి నవ్వినప్పుడు, ఆమెకు సహజంగానే సొట్ట బుగ్గలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ శస్త్ర చికిత్సను డింపుల్ ప్లాస్టీ అని పిలుస్తున్నారు. ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితమైనదిగానే చాలా మంది భావిస్తున్నారు. అయితే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం మాత్రం ఉందట (girl creates dimples).
ఆ సర్జీరీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (viral beauty trend). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఎప్పుడైనా సహజ అందమే చాలా బాగుంటుందని ఒకరు కామెంట్ చేశారు. సొట్ట బుగ్గుల కోసం సర్జరీ చేసిన తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆమెకు 18.. అతడికి 55.. వీరి విచిత్రమైన ప్రేమకథ గురించి తెలిస్తే..
మీ తెలివికి పరీక్ష.. ఈ కొండ మీదున్న మరో మనిషిని 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..