Share News

Giraffe vs Lion: జిరాఫీకి ఇంత బలం ఉంటుందా.. సింహం బారి నుంచి తన బిడ్డను ఎలా కాపడుకుందో చూడండి..

ABN , Publish Date - Aug 30 , 2025 | 07:36 PM

సింహం అంటే అడవికి రారాజు. సింహాన్ని చూస్తే అడవిలోని జంతువులన్నీ భయపడతాయి. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువు అడవిలో ఉండదు. అయితే అప్పుడప్పుడు సింహాలతో కొన్ని జంతువులు ప్రాణాలకు తెగించి పోరాడతాయి.

Giraffe vs Lion: జిరాఫీకి ఇంత బలం ఉంటుందా.. సింహం బారి నుంచి తన బిడ్డను ఎలా కాపడుకుందో చూడండి..
giraffe vs lioness

సింహం అంటే అడవికి రారాజు. సింహాన్ని చూస్తే అడవిలోని జంతువులన్నీ భయపడతాయి. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువు అడవిలో ఉండదు. అయితే అప్పుడప్పుడు సింహాలతో కొన్ని జంతువులు ప్రాణాలకు తెగించి పోరాడతాయి. సింహాలను చంపలేకపోయినప్పటికీ వాటిని భయపెట్టి తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. తాజాగా తన పిల్లను సింహం బారి నుంచి కాపాడుకోవడానికి ఓ జిరాఫీ ధైర్యంగా పోరాడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (giraffe vs lioness).


@AmazingSights అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (viral wildlife video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సింహం ఓ పిల్ల జిరాఫీని వెంటాడుతోంది. దానిని తరముకుంటూ వెళ్లింది. దాని మెడ పట్టుకుని కొరికేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడకు ఆ పిల్ల జిరాఫీ తల్లి వచ్చేసింది. ఆ సింహాన్ని తన కాళ్లతో తొక్కేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సింహం వెనక్కి తగ్గింది. ఆ పిల్ల జిరాఫీని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (giraffe lioness fight).


ఆ వీడియో (shocking wildlife encounter) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 78 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. జిరాఫీకి అంత బలం ఉంటుందా అని మరకొరు కామెంట్ చేశారు. తన బిడ్డ జోలికి వస్తే సింహంతోనైనా పోరాడే శక్తి తల్లికి వస్తుందని మరొకరు పేర్కొన్నారు. ఈ వీడియో నిజమైనదేనా, ఏఐ వీడియోనా అని మరొకరు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..

మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలోని ఉడతను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2025 | 07:36 PM