Share News

python swallows deer: జింకను మింగేసిన కొండచిలువ.. ఎన్ని అవస్థలు పడుతోందో చూడండి..

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:56 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

python swallows deer: జింకను మింగేసిన కొండచిలువ.. ఎన్ని అవస్థలు పడుతోందో చూడండి..
python swallows deer

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (giant snake video).


MahasayRit11254 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను కేరళలో చిత్రీకరించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కల్లాడి-అరన్మల రోడ్డులో ఒక కొండచిలువ జింకను పూర్తిగా మింగేసింది. దాంతో రోడ్డు దాటడానికి ఆపసోపాలు పడింది. ఆ కొండచిలువ రోడ్డు పక్కన ఉన్న అడవిలో ఒక జింకను వేటాడి దానిని పూర్తిగా మింగేసింది. ముందుకు కదలడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది (shocking wildlife clip).


నడిరోడ్డుపై అడ్డంగా, అతికష్టంగా పాకుతూ ఉన్న భారీ కొండచిలువను చూసిన చాలా మంది వాహనదారులు ఆగిపోయారు (goosebumps video). చివరకు ఎలాగోలా కష్టపడి రోడ్డు దాటేసింది. అక్కడకు చేరిన వాహనదారులు ఆ ఘటనను కెమెరాల్లో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వందల మంది ఆ వీడియోను వీక్షించి లైక్ చేశారు.


ఇవి కూడా చదవండి..

థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..


మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2025 | 06:56 PM