Get Rid of Lizards: మీ ఇంటి నుండి బల్లులను వదిలించుకోవడానికి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:01 PM
ఇంటి గోడల చుట్టూ తిరిగే బల్లుల వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. తలుపులు, కిటికీలు మూసివేసినా అవి లోపలికి ఒక మార్గాన్ని కనుగొంటాయి. కాబట్టి, మీ ఇంటి నుండి బల్లులను వదిలించుకోవడానికి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి.

బల్లులు అంటే చాలా మందికి చిరాకు. ఇంట్లో గోడల చూట్టు చక్కర్లు కొడుతుంటాయి. తలుపులు, కిటికీలు మూసివేసినా అవి లోపలికి వస్తూనే ఉంటాయి. ఈ బల్లులు వంటగదిలో సంచరిస్తే ఆహారం, ఇతర తినుబండారాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. పొరపాటున బల్లి ఆహారంలో పడినా దాని విషం వ్యాపిస్తుంది. ఆ ఆహారం తీసుకుంటే ప్రాణాపాయం ఉంటుంది. వాటిని తరిమేందుకుప్రజలు అన్ని రకాల పద్ధతులను ప్రయత్నిస్తారు, కానీ, ఎక్కడోచోట బల్లులు ఇంటి మూలాల్లో కనిపిస్తునే ఉంటాయి. అయితే, బల్లులను వదిలించుకోవడానికి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి.
ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసాన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. బల్లులు ఎక్కువగా కనిపించే ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. లేదంటే ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇంటి మూలల్లో ఉంచండి. ఉల్లిపాయ వాసన బల్లులను దూరం చేస్తుంది.
వెల్లుల్లి రెబ్బలు.
మీరు ఇంటి మూలల్లో వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఇది బల్లులను ఆ మూలల నుండి దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లి వాసన బల్లులు మీ ఇంటి దగ్గరికి కూడా రాకుండా చేస్తుంది.
నల్ల మిరియాలు
బల్లులను ఇంటి నుండి తరిమేయడానికి మీరు నల్ల మిరియాలు కూడా ఉపయోగించవచ్చు.
ఎండుమిర్చి
ఎండుమిర్చిని మెత్తగా పొడి చేసి, నీళ్లలో కలపాలి. తర్వాత మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపాలి. బల్లులు వచ్చే అవకాశం ఉన్న ప్రతిచోటా పిచికారీ చేయండి. ఆ వాసన ఇంట్లోకి బల్లులు రాకుండా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: మీరు జీవితంలో ఎప్పటికీ మోసపోరు, ఈ చాణక్య నియమాలను గుర్తుంచుకోండి..