Funny Bike Accident: ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడా చూసుండరు.. ఈ రెండు బైక్‌లను చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:27 PM
రోడ్ల మీద మనం ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు చూసి ఉంటాం. అలాంటి ప్రమాదాలను చూడడం ఎంతో భయంకరంగా, విషాదభరితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని యాక్సిడెంట్ చేస్తే మాత్రం నవ్వు రావడం ఖాయం.
రోడ్ల మీద మనం ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు (Road Accidents) చూసి ఉంటాం. రోడ్డు ప్రమాదాలను చూడడం ఎంతో భయంకరంగా, విషాదభరితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని యాక్సిడెంట్ చూస్తే మాత్రం నవ్వు రావడం ఖాయం. నిజానికి ఇది ప్రమాదంలా లేదు. రెండు వాహనాల మధ్య ప్రేమ సంబంధం లాగా ఉంది. దీంతో ఆ యాక్సిడెంట్‌ను చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు (Funny Bike accident).
jaipurkajalwa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిత్రీకరించారు. ఆ వీడియోలో రెండు బైక్‌లకు యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. అయితే యాక్సిడెంట్ తర్వాత ఆ రెండు బైక్‌లు ఒకదానినొకటి అతుక్కుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎంతసేపటికీ అవి విడిపోలేదు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న ప్రేమికుల తరహాలో ఆ రెండు బైక్‌లు నడిరోడ్డు మీద చాలా సేపు తిరుగుతూ ఉండిపోయాయి. వాటిని విడదయడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు.
ఆ రెండు బైక్‌ల రొమాన్స్ వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రెండు కోట్ల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 13 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చాలా కాలం తర్వాత కలుసుకున్నట్టు ఒకరినొకరు చక్కగా కౌగిలించుకుంటున్నారని ఒకరు కామెంట్ చేశారు. ఆ రెండు బైక్‌ల మధ్య పాత ఎఫైర్ ఉన్నట్టు కనబడుతోంది.
ఇవి కూడా చదవండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని సింహాలున్నాయో 12 సెకెన్లలో కనిపెట్టండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..