Share News

Cobra video: పాముతో పరాచకాలా.. కోబ్రాతో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:46 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు.

Cobra video: పాముతో పరాచకాలా.. కోబ్రాతో ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..
unbelievable snake video

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (cobra video).


munna_snake_rescuer అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఐదు నాగుపాములతో ఆటలాడుతున్నాడు. ఆ ఐదు నాగుపాములు పడగలు ఎత్తి అతడి వైపు చూస్తున్నాయి. అతడు వాటిని ఒట్టి చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో ఒక నాగుపాము అతడిని కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు చాకచక్యంగా తప్పించుకుంటూ పాములను అయోమయానికి గురి చేశాడు (man with cobras).


ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు (spine chilling moment,). ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. దాదాపు 3 వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము అని, చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చని ఒకరు కామెంట్ చేశారు. అతడి ధైర్యానికి సెల్యూట్ అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


Birds talking to woman: పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 08 , 2025 | 04:46 PM