Farmer Purchases 3 Crore Car: 3 కోట్ల కారు కొన్న రైతు.. ధోతీలో డెలివరీ కోసం..
ABN , Publish Date - Oct 16 , 2025 | 09:44 PM
ధోతీ కట్టుకుని, పగ్డీ ధరించిన ఓ రైతు తన భార్యతో పాటు మెర్సండెస్ బెంజ్ షో రూముకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరికీ షో రూము వాళ్లు ఘన స్వాగతం పలికారు.
‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అని అంటారు. ఇది అక్షర సత్యం. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ రైతు 3 కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. దాన్ని డెలివరీ తీసుకోవడానికి ధోతీ ధరించి షో రూముకు వెళ్లాడు. ఈ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఆ రైతు ఎవరన్న వివరాలు తెలియరాలేదు. కానీ, ఇందుకు సంబంధించిన వీడియో జిందగీ గుల్జర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు అయింది.
ఆ వీడియోలో ఏముందంటే.. ధోతీ కట్టుకుని, పగ్డీ ధరించిన ఓ రైతు తన భార్యతో పాటు మెర్సండెస్ బెంజ్ షో రూముకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరికీ షో రూము వాళ్లు ఘన స్వాగతం పలికారు. వాళ్లు లోపలికి రాగానే నల్ల రంగులో ఉన్న ‘మెర్సండెస్ జీ వేగాన్ 700’ దగ్గరకు తీసుకెళ్లారు. రైతు భార్య ఆ కారుకు పూజలు చేసింది. ఆ తర్వాత షో రూము మేనేజర్ కారు కీస్‌ను రైతుకు అందించాడు.
రైతు, అతడి భార్య కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పంజాబ్ రైతులకు ఖరీదైన కార్లు ఉండటం అన్నది సర్వసాధారణం. ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు’..‘రైతు అంత ఖరీదైన కారు కొనటం ఏంటి నాన్‌సెన్స్. అతడు రైతు కాదు’..‘దక్షిణాదిలో రైతులు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాబ్‌లో మాత్రం ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం
మీ పరిశీలనకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 60 సెకెన్లలో కనిపెట్టండి