Fake Flight: భారీ స్కామ్.. ఫ్లైట్ అటెండెంట్‌గా నటించి ఉచిత విమాన ప్రయాణాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:09 PM
ఎయిర్‌లైన్స్ సంస్థలకు టోకరా కొట్టి ఏకంగా 120 ఉచిత ప్రయాణాలు చేసిన ఓ వ్యక్తిని కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైట్ అటెండెంట్‌గా నటిస్తూ అక్రమంగా ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించిన టిరోన్ అలెగ్జాండర్ అనే అమెరికన్‌ను కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2018 నుంచి 2024 వరకూ అతడు మొత్తం 120 సార్లు అక్రమంగా ఉచిత ప్రయాణాలు చేశాడు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అలెగ్జాండర్ ఓ ఎయిర్‌లైన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, అతడు ఫ్లైట్ అటెండెంట్ లేదా పైలట్ మాత్రం కాదు. అయినా కూడా ఫ్లైట్ సిబ్బంది కోసం ఉద్దేశించిన ఉచిత విమానప్రయాణాలను అక్రమంగా వినియోగించుకున్నాడు. నకిలీ బ్యాడ్జ్‌లు, హైర్ డేట్‌ల సాయంతో ఆన్‌లైన్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా తన పేరును రిజిస్టర్ చేసుకుని టిక్కెట్లు బుక్ చేసుకునేవాడు. అమెరికన్ ఎయిర్‌లైన్స్, స్పిరిట్, యూనైటెడ్, డెల్టా వంటి అనేక సంస్థల విమానాల్లో అక్రమంగా జర్నీలు చేశాడు. ఇక ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ ద్వారా ఏకంగా 34 ఉచిత ప్రయాణాలు చేశాడు.
అలెగ్జాండర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ లావాదేవీల్లో అక్రమాలు, అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టులోని నిషిద్ధ ప్రాంతాల్లోకి ప్రవేశించడం తదితర అభియోగాలు మోపారు. అతడు దోషిగా తేలడంతో గరిష్ఠంగా 20 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. మూడేళ్ల కారాగార శిక్ష అనంతరం అతడిని విడుదల చేసే అవకాశం ఉన్నా ఇందుకు దాదాపు 2.15 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కోర్టు తీర్పుపై ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ హర్షం వ్యక్తం చేసింది. అతడు నిబంధనలు ఉల్లంఘించినా కూడా ఇతర ప్రయాణికులకు అతడి వల్ల ఎలాంటి అపాయం కలుగలేదని వెల్లడించింది. అయితే, ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ ఉద్యోగి ఇంత భారీ స్థాయిలో మోసానికి దిగడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ
ఈ అంబులెన్స్ డ్రైవర్ టాలెంటే వేరబ్బా.. ఎలా డ్రైవ్ చేశాడో చూస్తే..
Read Latest and Viral News