Swing Accident: వామ్మో.. కళ్ల ముందే ప్రమాదం.. జాతరలో ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:27 PM
సాధారణంగా చాలా గ్రామాలు, పట్టణాలలో పండుగల సందర్భంగా జాతరలు జరుగుతుంటాయి. రకరకాల దుకాణాలు వెలుస్తుంటాయి. జాతరల్లో ఏర్పాటు చేసే రంగుల రాట్నం, ఊయల వంటి వాటిని ఎక్కేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
సాధారణంగా చాలా గ్రామాలు, పట్టణాలలో పండుగల సందర్భంగా జాతరలు జరుగుతుంటాయి. రకరకాల దుకాణాలు వెలుస్తుంటాయి. జాతర్లలో ఏర్పాటు చేసే రంగుల రాట్నం, ఊయల వంటి వాటిని ఎక్కేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ జాతరకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బ్రేక్ డ్యాన్స్ స్వింగ్ దగ్గర షాకింగ్ ప్రమాదం జరిగింది (Swing accident fair).
ajaysharma.aap అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (swing breaks video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ జాతరలో బ్రేక్ డ్యాన్స్ స్వింగ్ వేగంగా తిరుగుతోంది. వేర్వేరు సీట్లపై చాలా మంది వ్యక్తులు కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక సీటు విరిగిపడింది. అది పల్టీలు కొట్టి ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయారు. అయితే ఆ ప్లాట్‌ఫామ్ గుండ్రంగా తిరుగుతున్న కారణంగా వారిద్దరూ ఆ విరిగిన సీటుతో పాటే వెళ్లిపోయారు.
ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు (amusement park accident). ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 5.4 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. దీనికి ప్రధాన కారణం బరువు అసమతుల్యత అని ఒకరు కామెంట్ చేశారు. వాళ్లు మళ్లీ ఎప్పటికీ బ్రేక్ డ్యాన్స్ స్వింగ్ ఎక్కరని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. సీతాకోకచిలుకల మధ్యన చీమను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..