Shocking makeover: ఏఐ కూడా కళ్లు తేలేస్తుంది.. ఈ మేకప్ మాయ చూస్తే నివ్వెరపోవాల్సిందే
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:09 PM
సహజ సౌందర్యానికి విలువ లేకుండా పోయింది. ఎలా ఉన్న వారినైనా అందంగా మార్చేసే సరికొత్త మేకప్ అందుబాటులోకి వచ్చింది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుత ఆధునిక యుగంలో మేకప్ నిత్యకృత్యంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు మేకప్ లేకుండా బయట కనిపించడం అరుదుగా మారిపోయింది. సహజ సౌందర్యానికి విలువ లేకుండా పోయింది. ఎలా ఉన్న వారినైనా అందంగా మార్చేసే సరికొత్త మేకప్ అందుబాటులోకి వచ్చింది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు (aunty makeover viral video).
maha_luxury_beauty అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళకు ఆధునిక పరికరాలు ఉపయోగించి మేకప్ వేస్తున్నారు. నల్లగా ఉన్న ఆమె చూడడానికి పెద్ద వయసు మహిళలా కనిపిస్తోంది. భారీ ఆభరణాలు, ఫేస్ మేకప్, అందమైన హెయిర్‌స్టైల్‌తో ఆ మహిళను ఒక సినీ నటిలా మార్చేశారు. ఆ వీడియో చూడడానికి ఏఐ వీడియోలా కనిపిస్తోంది. అయితే ఇది ఏఐ-జనరేటెడ్ వీడియో కాదు అని స్పష్టంగా పేర్కొన్నారు (dramatic transformation).
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ( shocking makeover Video). లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. నమ్మలేకపోతున్నామని చాలా మంది కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రతిభ చాలా అరుదని కొందరు ప్రశంసలు కురిపించారు. ఇది ఏఐ వీడియో కాదు అంటే నమ్మలేకపోతున్నామని చాలా మంది పేర్కొన్నారు. ఈ మాయ చూస్తే ఏఐ కూడా కళ్లు తేలేస్తుందని మరికొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
అరటిపండు సుత్తిలా మారుతుంది.. వేడినీరు సెకెన్లలో గడ్డకడుతుంది..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 37ల మధ్యలో 87 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..