Man drinks motor oil: ఫుడ్ లేదు.. వాటర్ లేదు.. 30 ఏళ్లుగా ఇంజినాయిల్‌తోనే జీవనం.. డాక్టర్లే షాక్..
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:15 AM
ఆ వ్యక్తిని అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో అందరికీ షాకిస్తున్నాడు.. గత ముప్పై ఏళ్లుగా అతడు ఆహారం తీసుకోవడం లేదు.. కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదు..
ఆ వ్యక్తిని అందరూ ఆయిల్ కుమార్ (Oil Kumar) అని పిలుస్తారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో అందరికీ షాకిస్తున్నాడు.. గత ముప్పై ఏళ్లుగా అతడు ఆహారం తీసుకోవడం లేదు.. కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదు.. అతడు మూడు దశాబ్దాలకు పైగా ఆహారం తినకుండా కేవలం టీ, ఇంజినాయిల్‌తోనే జీవితం గడిపేస్తున్నాడు. అతడి కేసు డాక్టర్లకే షాకిస్తోంది. దీంతో అతడిని స్థానికులు అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తుంటారు (man drinks motor oil).
సాధారణంగా ఇంజినాయిల్ తాగడం అనేది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇంజినాయిల్‌లో పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs), సీసం, రాగి వంటి భారీ లోహాలు, జింక్ డయాల్కైల్డిథియోఫాస్ఫేట్ లాంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి. ఇంజినాయిల్ తాగడం వల్ల కేన్సర్, నరాల సంబంధిత వ్యాధులతో పాటు కీలక అవయవాలన్నీ దెబ్బతింటాయి. మోటార్ ఆయిల్ ఊపిరితిత్తుల్లోకి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది (bizarre eating habits).
ఇంజినాయిల్‌ను కొద్దిపాటి మోతాదులో తీసుకున్నా వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అయితే కుమార్ మాత్రం అలాంటి లక్షణాలేం లేకుండా హాయిగా జీవిస్తున్నాడు (strange news). ఎప్పుడూ ఆస్పత్రి పాలవలేదు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్‌ను తాగుతుంటాడు. ఏడాదిలో సగంరోజులు అయ్యప్ప స్వామి దీక్షలో గడుపుతాడు.
ఇవి కూడా చదవండి..
విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..
మీది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోల్లో మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..