Share News

Boss Uses AI Instead Of Expert: చాట్‌జీపీటీ సలహాలనే వింటున్న బాస్.. అవమానం తట్టుకోలేక ఆ ఉద్యోగి

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:28 PM

చాట్‌జీపీటీపై బాస్ ఎక్కువగా ఆధారపడుతూ తన సలహాలు పట్టించుకోవట్లేదని హర్టైపోయిన ఓ అకౌంటెంట్ రాజీనామాకు సిద్ధమయ్యారు. తన ఆవేదన వెళ్లబుచ్చుకుంటూ సదరు ఉద్యోగి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Boss Uses AI Instead Of Expert: చాట్‌జీపీటీ సలహాలనే వింటున్న బాస్.. అవమానం తట్టుకోలేక ఆ ఉద్యోగి
Boss Uses AI Instead Of Expert

ఇంటర్నె్ట్ డెస్క్: చాట్‌జీపీటీ, కోపైలట్ లాంటి చాట్‌బాట్‌లకు జనాలు క్రమంగా అలవాటు పడుతున్నారు. విద్య, వైద్యం మొదలు అనేక అంశాల్లో ఈ జనరేటివ్ ఏఐ చాట్‌బాట్‌ల సలహాలు తీసుకుంటున్నారు. కంపెనీలు కూడా ఇలాంటి చాట్‌బాట్‌లకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. తన బాస్ ధోరణి కూడా ఇలాగే ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ఓ ఉద్యోగి రాజీనామా చేసేందుకు డిసైడ్ అయ్యారు. పనిలోపనిగా తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ ట్రెండవుతోంది.

తన కంపెనీ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఒకే ఒక అకౌంటెంట్ తనే అయినప్పటికీ సీఈఓ బాస్ మాత్రం తనను ఖాతరు చేయట్లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయాన్ని చాట్‌జీపీటీతో చర్చించి అది ఇచ్చిన సలహాలను తనను ఫాలో కావాలని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘చాట్‌జీపీటీ అలా చేయమంది.. ఇలా చేయమంది అన్న మాటలు వినీ వినీ విసుగొచ్చేసింది. చాట్‌జీపీటీ ఇచ్చే ప్రతిసమాచారం కరెక్టుగా ఉండదు. నిజాలకు అదేమీ పర్యాయపదం కాదు. ఏదైనా పని కావాలని చెబితే నేను చేసి పెడతాను కదా.. కంపెనీ అవసరాలకు తగినట్టు సూచనలు చేస్తాను. కానీ మా బాస్ ఇవేమీ పట్టించుకోవట్లేదు’’ అని సదరు ఉద్యోగి వాపోయారు. చాట్‌జీపీటీని నమ్ముకుని తనను పక్కనపెట్టేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తన సలహాలను స్వీకరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. చాట్‌జీపీటీ కూడా తప్పులు చేస్తుందన్న స్పృహ ఉండట్లేదని అన్నారు. ‘‘జాబ్‌కు రిజైన్ చేసేందుకు నిర్ణయించుకున్నా.. నీకు ఏదైనా డౌట్ వస్తే చాట్‌జీపీటీని అడిగే బదులు నన్ను అడగొచ్చుగా’’ అంటూ ఆవేదన వెళ్లగక్కారు.


ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేయడం కరెక్టు కాదు. నీ బాస్ ఏది చెబితే దానికి ఉత్సాహంగా ఊ కొట్టు. ఆయన వెళ్లిపోయాక నీకు నచ్చింది చేసుకో’ అని ఓ వ్యక్తి తెలిపాడు. అతడి బాస్ తీరులో వింత ఏమీ లేదని మరో వ్యక్తి కామెంట్ చేశారు. చాట్‌జీపీటీని నమ్ముకుని సుడిగాలిలో చిక్కుకున్న వ్యక్తులు కూడా తనకు తెలుసునని ఓ వ్యక్తి తెలిపాడు. ‘‘సుడిగాలి వస్తే షాపులో దాక్కోమని చాట్‌జీపీటీ సలహా ఇచ్చింది. ఇంటికిందున్న బేస్‌మెంట్ కంటే అదే బెటర్ అని సలహా ఇచ్చింది. దీన్నే గుడ్డిగా నమ్మిన ఓవ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఇలాంటి వాళ్లను ఏమీ చేయలేము’’ అని ఓ వ్యక్తి నిట్టూర్చారు.

ఇవి కూడా చదవండి:

మొదటిసారి బంగారం కంటున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవంటే..

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Viral News

Updated Date - Apr 10 , 2025 | 04:28 PM