Share News

Elephant vs lions: ఇక్కడ రాజెవరో చూడండి.. ఏనుగును చూసిన సింహాల గుంపు ఏం చేసిందంటే..

ABN , Publish Date - Sep 17 , 2025 | 07:08 PM

సాధారణంగా అడవికి రాజెవరు అంటే సింహం అని చెబుతుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని అనుకుంటాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది.

Elephant vs lions: ఇక్కడ రాజెవరో చూడండి.. ఏనుగును చూసిన సింహాల గుంపు ఏం చేసిందంటే..
elephant vs lions

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా అడవికి రాజెవరు అంటే సింహం (Lion) అని చెబుతుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని అనుకుంటాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగును చూసి సింహాలు పారిపోయాయి (wild animal encounter).


@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని సింహాలు తమ పిల్లలతో కలిసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి (lions under tree). అక్కడకు ఓ భారీ ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది. మెల్లిగా ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న ఏనుగు సింహాలను చూసి పెద్దగా గర్జించింది. దీంతో ఆ చెట్టు కింద ఉన్న సింహాలు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఓ ఏనుగును చూసి సింహాలు అలా పారిపోవడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. 'ఇప్పుడు చెప్పండి.. అడవికి రాజెవరు' అని కామెంట్ చేశారు (viral wildlife video).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (surprising wildlife moment). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.2 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు మూడున్నర వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అడవి రాజుకు ఇప్పుడు భద్రత అవసరమని అనిపిస్తుందని ఒకరు కామెంట్ చేశారు. అడవికి నిజమైన రాజు ఏనుగని మరొకరు పేర్కొన్నారు. సింహాలు తమ శక్తిని తెలుసుకోలేవని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. ఈ తెలివికి సలాం చెప్పాల్సిందే.. బైక్ టైర్‌లో గాలి ఎలా నింపుతున్నాడో చూడండి..

మీ దృష్టికి పరీక్ష.. ఈ బెడ్రూమ్‌లో సీతాకోకచిలుక ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2025 | 09:46 PM