Viral Video: పాపం.. ఈ ముసలాయన కష్టం ఎవరికీ రాకూడదు..
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:45 AM
Elderly Man Viral Video: పెళ్లి కాని వాళ్లు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లయిన వాళ్లు .. పెళ్లి వద్దని పెళ్లి కాని వారికి సలహా ఇస్తున్నారు. 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. తాజాగా, ఓ ముసలాయన పెళ్లి కోసం దేవుడ్ని ప్రార్థించాడు.

ఓ సినిమా పాటలో గేయ రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రి.. ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… భర్తగా మారకు బ్యాచిలరూ… షాదీ మాటే వద్దు గురూ… సోలో లైఫే సో బెటరూ’ అని పెళ్లి మీద అద్భుతంగా రాశారు. పెళ్లి విషయంలో ఎవ్వరికీ పూర్తి క్లారిటీ లేదు. పెళ్లి చేసుకున్న వారు ‘పెళ్లి చేసుకుని కష్టాలు పడకండి’ అంటూ పెళ్లి కాని వారికి సలహా ఇస్తున్నారు. పెళ్లికాని వారు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 60 ఏళ్లు దాటి పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో చాలా మంది బాధపడుతున్నారు. సరైన టైంలో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా పెళ్లి చేసుకోనందుకు బాధపడుతున్నారు. సరైన టైంలో పెళ్లి చేసుకుని ఉంటే బాగుందని అంటున్నారు.
60 ఏళ్లు దాటి భార్య చనిపోయిన భర్తలు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, కొంతమందికి మాత్రం రాలిపోయే వయసులో ఒక్కసారి కూడా పెళ్లి కావటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో కూడా ఓ పెద్దాయనది అదే పరిస్థితి. 60 ఏళ్లు దాటినా ఆయనకు ఇంత వరకు పెళ్లి కాలేదు. పెళ్లి కోసం ప్రయత్నాలు చేసి, చేసి విసిగిపోయాడే కానీ, పెళ్లి మీద ఆశ చావలేదు. ప్రతీ రోజు దేవుడ్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ రోజు దేవుడి విగ్రహాల దగ్గరకు వెళ్లి తన గోడును వెల్లబోసుకున్నాడు. తనకు పెళ్లి చేయమంటూ దేవుడ్ని ప్రార్థించాడు. భార్య కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంటల్లోనే లక్షల వ్యూస్ తెచ్చుకుంది.
కొన్ని వేల లైకులు వచ్చాయి. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ పాపం.. లేటు వయసులో ఈ పెద్దాయనకు ఎన్ని కష్టాలు వచ్చాయి. దేవుడు అతడి ప్రార్థనల్ని తప్పకుండా నెరవేరుస్తాడు’.. ‘ పెద్దాయన కష్టం పగవాడికి కూడా రాకూడదు’..‘ నాకు 30 దాటాయి.. ఇంకా పెళ్లి కాలేదు. ఇకపై అవుతుందో కాదో కూడా తెలీదు. కానీ, ఈ పెద్దాయన మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నాడు’.. ‘ పెద్దాయన.. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని.. శేష జీవితాన్నైనా హ్యాపీగా గడుపు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Ramdev Baba: మరో కాంట్రవర్సీలో రాందేవ్ బాబా.. ఈసారి షర్బత్ జిహాద్
Bihar Woman Love: ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చి ప్రేమలో పడేశాడు..