Share News

Elderly Man Narrowly Escapes: భూమ్మీద నూకలున్నాయ్.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

ABN , Publish Date - Oct 23 , 2025 | 09:46 PM

ఓ ముసలాయన వాటర్ బాటిల్ పట్టుకుని రైలు పట్టాలపై కూర్చుని ఉన్నాడు. రైలు అదే పట్టాలపై వేగంగా దూసుకుని వస్తూ ఉంది. ఇది గమనించిన ముసలాయన వెంటనే పైకి లేచాడు. ప్లాట్‌ఫామ్ మీద కూర్చున్నాడు. రైలు చాలా దగ్గరకు వచ్చేసింది.

Elderly Man Narrowly Escapes: భూమ్మీద నూకలున్నాయ్.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
Elderly Man Narrowly Escapes

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రైలు పట్టాలు దాటుతూ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అదృష్టం బాగుండి చావునుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా, ఓ ముసలాయన రైలు పట్టాలు (Elderly Man On Railway Track) దాటుతూ.. క్షణాల కాలంలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. లేదంటే ఆయన ప్రాణాలు పోయేవి. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలియరాలేదు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ ముసలాయన వాటర్ బాటిల్ పట్టుకుని రైలు పట్టాలపై(Viral Train Near-Miss Video) కూర్చుని ఉన్నాడు. రైలు అదే పట్టాలపై వేగంగా దూసుకుని వస్తూ ఉంది. ఇది గమనించిన ముసలాయన వెంటనే పైకి లేచాడు. ప్లాట్‌ఫామ్ మీద కూర్చున్నాడు. రైలు చాలా దగ్గరకు వచ్చేసింది. ఆయన కాళ్లు ఇంకా ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు ఉన్నాయి.


రైలు అడుగుల దూరంలోకి వచ్చేసింది. ఓ రెండు సెకన్లు ఉంటే రైలు ఆయన్ని ఢీకొట్టేస్తుంది. ఇలాంటి సమయంలో(Railway Safety) ఆయన పక్కకు తప్పుకున్నాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడినుంచి లేచి దూరంగా వెళ్లిపోయాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పెద్దాయన.. నీకు భూమ్మీద నూకలు ఉన్నాయ్. లేదంటే ప్రాణాలు పోయేవి’..‘జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదు. పట్టాలపైకి దిగుతూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

సేల్స్‌మ్యాన్‌ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహనీ?

Updated Date - Oct 23 , 2025 | 09:50 PM