Shocking China News: బార్‌లో రచ్చ చేసిన పిల్లలు.. తల్లిదండ్రులకు కోర్ట్ ఇచ్చిన షాక్ ఏంటంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:38 AM
చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు తప్ప తాగి చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులు భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన చైనాలోని ఎంతో మంది పేరెంట్స్‌కు కనువిప్పుగా నిలుస్తోంది. మార్చి నెలలో షాంఘైలోని హైడిలావ్ హాట్‌పాట్‌కు ఇద్దరు యువకులు వెళ్లి మద్యం సేవించారు.
చైనా (China)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు తప్ప తాగి చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులు భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన చైనాలోని ఎంతో మంది పేరెంట్స్‌కు కనువిప్పుగా నిలుస్తోంది. మార్చి నెలలో షాంఘైలోని హైడిలావ్ హాట్‌పాట్‌కు ఇద్దరు యువకులు వెళ్లి మద్యం సేవించారు. మద్యపానం తర్వాత వారు ఆ రెస్టారెంట్‌లో అసభ్యకర పనులు చేశారు. టేబుల్ పైకి ఎక్కి సూప్‌లో మూత్ర విసర్జన చేశారు. ఆ యువకులిద్దరి వయసు 17 సంత్సరాలు కావడం గమనార్హం (Teenagers urinate in soup).
మద్యం మత్తులో ఉన్న యువకులు రెస్టారెంట్ వంటగదిలోని టేబుల్‌పైకి ఎక్కి మాంసం, కూరగాయలు వండడానికి ఉపయోగించే సూప్‌లో ఉద్దేశపూర్వకంగా మూత్ర విసర్జన చేశారు. వారు చేసిన రభసపై హోటల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు ఆ యువకుల తల్లిదండ్రులకు షాకిచ్చింది. రెస్టారెంట్‌కు, మార్చి 8- 10వ తేదీల మధ్యలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన వినియోగదారులకు నష్టపరిహారంగా 2.3 మిలియన్ యువాన్లు (దాదాపు 2.5 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది (drunk teens restaurant).
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలతో కూడిన పెంపకాన్ని అందించడంలో విఫలమయ్యారని కోర్టు తీర్పు ఇచ్చింది (court punishes parents). ఈ జంట, వారి పిల్లలు వార్తా పత్రిక ప్రకటన ద్వారా క్షమాపణ చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది. మార్చి 8- 10వ తేదీల మధ్యలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్లకు పూర్తి వాపసుతో పాటు వారి బిల్లుకు 10 రెట్లు పరిహారం అందుతుంది. మూత్రంతో కలుషితమైన పాత్రలను శుభ్రం చేయడానికి, కొత్త పాత్రలను కొనుగోలు చేయడానికి అయిన ఖర్చులను కూడా రెస్టారెంట్ తిరిగి పొందుతుంది.
ఇవి కూడా చదవండి..
విపత్తు సమయంలోనూ వ్యాపారం.. అతడు కార్న్ స్టాల్ ఎక్కడ పెట్టాడో చూడండి..
మీది సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ అయితే.. ఈ ఫొటోల్లో మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..