Share News

Viral Video: తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:48 PM

Viral Video: కొంచెం కూడా ఒంటి మీద సోయి లేకుండా ఒంటిపై పడిపోయాడు. ఆ వ్యక్తిని కారులో వెళుతున్న వారు హెచ్చరించినా లాభం లేకపోయింది. ఒకానొక దశలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి.. ఒంటిపై వెళుతున్న అతడిపై నీళ్లు కూడా చల్లాడు.

Viral Video: తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..
Viral Video

హైదరాబాద్, మెహదీపట్నంలోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వే పై ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఓ వ్యక్తి(ఒంటె యజమాని) ఒంటెపైకి ఎక్కాడు. అది రోడ్డు మీద పరుగులు తీస్తూ పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వే పైకి వచ్చేసింది. వేగంగా వెళుతున్న వాహనాల మధ్య అది కూడా పరుగులు తీయటం మొదలెట్టింది. వేగంగా వెళుతోంది. ఒంటి మీద ఉన్న వ్యక్తి మత్తులో అటు, ఇటు ఊగుతూ ఉన్నాడు. ఎప్పుడు కింద పడిపోతాడో తెలియని పరిస్థితి.


ఒక వేళ అతడు కిందపడి ఉంటే వేగంగా వచ్చే వాహనాల కింద పడి చచ్చేవాడు. కొంచెం కూడా ఒంటి మీద సోయి లేకుండా ఒంటిపై పడిపోయాడు. ఆ వ్యక్తిని కారులో వెళుతున్న వారు హెచ్చరించినా లాభం లేకపోయింది. ఒకానొక దశలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి.. ఒంటిపై వెళుతున్న అతడిపై నీళ్లు కూడా చల్లాడు. ఊహూ.. లాభం లేదు లేకుండా పోయింది. ఒంటె వెళుతున్న వేగానికి ఏదైనా వాహనం దాన్ని ఢీ కొడితే.. అది చచ్చే అవకాశం ఉంది. దానితో పాటు పైన కూర్చున్న వ్యక్తి కూడా చచ్చే అవకాశం ఉంది.


ఇది గ్రహించిన కొంతమంది వాహనదారులు ఒంటెను అడ్డగించారు. ఐకే షార్ట్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు దాన్ని ఎక్కడికీ పోనివ్వకుండా రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌‌గా మారింది. ఇక, ఈ వీడియోపై కొంతమంది సీరియస్‌గా స్పందిస్తుంటే.. మరికొంతమంది ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘తమ్ముడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. అది కూడా వాహనం లేకుండా’..‘అది ఫోర్ వీలర్ బండే కదా.. పోనివ్వండి’ అంటూ కామెడీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..

Updated Date - Jun 21 , 2025 | 06:48 PM