Share News

Rythu Bharosa: 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:41 PM

Rythu Bharosa: రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. నిన్న 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.

Rythu Bharosa: 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.. చెక్ చేసుకోండి..
Rythu Bharosa

అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. నిన్న 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 905.89 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.


శనివారం 9 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. భూమి పరంగా .. 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

మొబైల్ ఫోన్ విషయంలో గొడవ.. అర్థరాత్రి ఇంటికి వచ్చి..

పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..

Updated Date - Jun 21 , 2025 | 04:54 PM