Share News

Viral Video: ఛీ నువ్వసలు డాక్టర్‌వేనా.. ఇంత దారుణమా..

ABN , Publish Date - Apr 17 , 2025 | 07:51 AM

Drunk Doctor And Child Viral Video: వైద్య వృత్తికి కలంకం కలిగించే విధంగా ఓ డాక్టర్ ప్రవర్తించాడు. ఓ చిన్న పిల్లాడితో చేయించకూడని పని చేయించాడు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా జనాలు మాత్రం పట్టించుకోవటం లేదు.

Viral Video: ఛీ నువ్వసలు డాక్టర్‌వేనా.. ఇంత దారుణమా..
Drunk Doctor And Child

సాధారణంగా దగ్గు వస్తే మందులు వేసుకుంటారు.. సిరప్ తాగుతారు. అయినా తగ్గలేదంటే కొంతమంది ఇంటి చిట్కాలు పాటిస్తారు.. ఆయుర్వేద మందులు కూడా వాడతారు. వీటన్నింటికీ మించి.. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు జనాల్లో ఓ మూఢ విశ్వాసం వేళ్లూనుకపోయింది. సిగరెట్, బీడీ తాగితే దగ్గు తగ్గుతుందని కొంతమంది భావిస్తున్నారు. వాటిని కొంతమంది నేరుగా కాలుస్తుంటే.. మరికొంతమంది వాటిలో వాము లాంటి పదార్ధాలు పెట్టి కాలుస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా జనాలు మాత్రం పట్టించుకోవటం లేదు.


అయితే, జనాలకు ఏది తప్పో..ఏది ఒప్పో చెప్పాల్సిన ఓ డాక్టర్ మూర్ఖంగా ప్రవర్తించాడు. దగ్గుతో బాధపడుతున్న చిన్నారితో సిగరెట్ తాగించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, జలౌన్‌కు చెందిన ఓ 4 ఏళ్ల బాలుడు గత కొంతకాలంగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. డాక్టర్ సురేష్ చంద్ర బాలుడ్ని పరీక్షించాడు. దగ్గు తగ్గడానికి మందులు ఇవ్వాల్సిందిపోయి సిగరెట్ తీసి బాలుడికి అందించాడు. దాన్ని తాగమన్నాడు.


సిగరెట్ తాగితే దగ్గు తగ్గుతుందని చెప్పాడు. పిల్లాడు సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. స్వయంగా ఆ డాక్టరే సిగరెట్ అంటించాడు. పిల్లాడు గుప్పుగుప్పుమంటూ సిగరెట్ తాగాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. అధికారుల విచారణ చేయగా.. సురేష్ తాగి విధులకు వచ్చినట్లు తేలింది. దీంతో అతడ్ని వేరే చోటకు ట్రాన్స్‌ఫర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు డాక్టర్‌పై మండిపడుతున్నారు. ‘ఛీ .. చిన్న పిల్లాడితో అలాగేనా ప్రవర్తించేది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Actress Abhinaya: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన నటి అభినయ

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

Updated Date - Apr 17 , 2025 | 07:58 AM