Share News

Astrology: పొరపాటున కూడా ఇతరుల నుండి ఈ వస్తువులను తీసుకోకండి.. ఆర్థిక సమస్యలు వస్తాయి..

ABN , Publish Date - Jan 19 , 2025 | 05:01 PM

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరుల నుంచి మనం కొన్ని వస్తువులను పొరపాటున కూడా మన ఇంట్లోకి తీసుకురాకూడదు. అయితే, ఎలాంటి వస్తువులను తీసుకోకూడదు? తీసుకుంటే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Astrology: పొరపాటున కూడా ఇతరుల నుండి ఈ వస్తువులను తీసుకోకండి.. ఆర్థిక సమస్యలు వస్తాయి..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరుల నుంచి మనం కొన్ని వస్తువులను పొరపాటున కూడా తీసుకోకూడదు. వాటిని మన ఇంట్లోకి తీసుకొస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే, ఎలాంటి వస్తువులను తీసుకోకూడదు? తీసుకుంటే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాత లేదా చిరిగిన బట్టలు

ఇతరుల పాత లేదా చిరిగిన బట్టలు ఇంటికి తీసుకురావద్దు. బాక్టీరియా, వైరస్‌లు లేదా ఇతర జీవులు ఆ దుస్తులలో చిక్కుకుపోతాయి. ఇది మీ శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనితో పాటు, మీరు ఇతరుల శరీరం నుండి ప్రతికూల శక్తిని పొందవచ్చు, కాబట్టి దీనిని నివారించాలి.

పాత సామాన్లు

వాస్తు శాస్త్రం ప్రకారం సాధారణంగా పాత సామాన్లు అవసరమైనప్పుడు ఇతరుల ఇళ్ల నుంచి కొనుగోలు చేస్తుంటారు. అలా చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు నెగెటివ్ ఎనర్జీ కూడా వస్తుందని అంటున్నారు. కాబట్టి, మీరు పాత ఫర్నీచర్‌ని తీసుకువస్తున్నప్పటికీ గంగాజలంతో శుభ్రం చేసుకోండి.


బూట్లు, చెప్పులు..

చాలా సార్లు మనం ఎవరి ఇంటికి వెళ్లినా వారి బూట్లు, చెప్పులు వాడేస్తుంటాం. అలా చేయడం వల్ల నష్టమేమీ లేదు. కానీ, మన ఇంట్లోకి ఇతరుల బూట్లు, చెప్పులు తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల ఇతరుల నెగెటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి వస్తుంది. దీంతో అన్ని పనులు ఆటోమేటిక్‌గా చెడిపోవడం మొదలవుతుంది.

గొడుగు

వాస్తు శాస్త్రం ప్రకారం మనం వేరొకరి ఇంటి నుండి గొడుగు తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల వ్యక్తి జాతకంలో గ్రహాల స్థితి చెడిపోతుందని అంటారు. కావాలంటే దానిని ఉపయోగించిన తర్వాత ఇంటి బయటే పెట్టండి.. వీలైనంత త్వరగా తిరిగి వారికే ఇవ్వండి.

Updated Date - Jan 19 , 2025 | 05:24 PM