Indian innovation: వావ్.. గ్యాస్ స్టవ్‌ను ఇలా కూడా వెలిగించవచ్చా? ఈ ట్రిక్ చూడండి..
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:05 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్లు ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, జుగాడ్ వీడియోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, జుగాడ్ వీడియోలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్ చేస్తోంది (Jugaad viral video).
@MaanpalSin8672 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Indian innovation). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ స్టవ్‌ను వెలిగించడానికి వెరైటీ ట్రిక్ ఉపయోగించాడు. సాధారణంగా గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్, అగ్గిపెట్టె లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి దోమల బ్యాట్‌తో గ్యాస్ స్టవ్‌ను వెలిగించాడు. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన దోమల బ్యాట్ పెట్టాడు.
ఆ బ్యాట్‌పై చాకు పెట్టడంతో నిప్పు రవ్వలు చెలరేగాయి (Smart hacks video). ఆ నిప్పు రవ్వ సహాయంతో గ్యాస్ స్టవ్ మీద మంట వెలిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. తెలివిలో భారతీయులతో పోటీ పడగల వారు ఎవరైనా ఉన్నారా అని ఒకరు ప్రశ్నించారు. భారతదేశం రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు చేస్తోందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. సీతాకోకచిలుకల మధ్యన చీమను 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..