Share News

Powerful incense stick: ఈ అగరబత్తీ చాలా పవర్‌ఫుల్.. ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:39 PM

మన దేశంలో చాలా మంది సాధారణ ప్రజలను దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దోమలను ఇళ్ల నుంచి తరమడానికి అందరూ రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు. లిక్విడ్‌లు, పొగ వచ్చే కాయిల్స్ వాడుతుంటారు. మరికొందరు దోమల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన నూనెలు వాడుతుంటారు.

Powerful incense stick: ఈ అగరబత్తీ చాలా పవర్‌ఫుల్.. ఈ మహిళకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
mosquito control

మన దేశంలో చాలా మంది ప్రజలను దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దోమలను ఇళ్ల నుంచి తరమడానికి అందరూ రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు. లిక్విడ్‌లు, పొగ వచ్చే కాయిల్స్ వాడుతుంటారు. మరికొందరు దోమల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన నూనెలు వాడుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ వెరైటీ ట్రిక్‌తో దోమలను చంపింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (mosquito control).


@gujjuallrounder అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కాగితంపై చాలా దోమలు పడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలోని మహిళ.. 'ఈ దోమలన్నీ ఎగురుతూ ఉన్నాయి. అప్పుడు నేను ఒక అగరుబత్తి వెలిగించాను. వెంటనే అవన్నీ పడిపోవడం ప్రారంభించాయి. ఆ తర్వాత, నేను వాటన్నింటినీ సేకరించాను. ప్రస్తుతానికి అవి చనిపోలేదు. అపస్మారక స్థితిలో ఉన్నాయి. వాటిని ఈ స్థితిలో వదిలివేయకూడదు. మనం వాటి చివరి కర్మలు చేయాలి' అని చెబుతోంది (mosquito problem).


ఆ దోమలన్నింటినీ ఆ మహిళ మంటల్లో వేసి కాల్చేసింది (viral hack). ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. అక్కా.. మీరు ఎన్ని దోమలను చంపారని ఒకరు ప్రశ్నించారు. ఆ అగరబత్తీ బ్రాండ్ ఏంటో చెప్పండని మరికొందరు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2025 | 06:42 AM