Share News

Delhi teen Thar crash: పాపం.. థార్ ఎక్కి రీల్స్ చేద్దామనుకున్నాడు.. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో..

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:21 PM

యువత రీల్స్ మోజులో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు థార్ కారును రెంట్‌కు తీసుకుని రీల్స్ చేద్దామనుకున్నాడు. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది

Delhi teen Thar crash: పాపం.. థార్ ఎక్కి రీల్స్ చేద్దామనుకున్నాడు.. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో..
Delhi youth car crash

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత రీల్స్ మోజులో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు థార్ కారును రెంట్‌కు తీసుకుని రీల్స్ చేద్దామనుకున్నాడు. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది (rented Thar accident Noida).


ఢిల్లీ సమీపంలోని నోయిడా నగరంలో ఓ బాలుడు మహీంద్రా థార్‌ను రెంట్‌కు తీసుకుని నగర రోడ్లపై బీభత్సం సృష్టించాడు. రీల్స్ చేద్దామనుకున్న17 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్‌తో కలిసి స్థానికంగా ఉన్న కార్‌ రెంటల్‌ షోరూం దగ్గరకు వెళ్లి మహింద్రా థార్ ఎస్‌యూవీని రెంట్‌కు తీసుకున్నాడు. స్నేహితుడితో కలిసి ఆ కార్‌ను తీసుకొని బయల్దేరాడు. కార్ డ్రైవ్ చేస్తున్న బాలుడికి మార్గ మధ్యంలో వాళ్ల కుటుంబ సభ్యులు కనిపించారు. దీంతో ఆ కుర్రాడు కంగారుపడ్డాడు. డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు (teenager crashes SUV to avoid parents).


రోడ్డుపై అడ్డొచ్చిన అన్ని వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు (Noida viral crash video,). ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కార్లోని ఇద్దరు బాలలకు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. దీంతో వారు అక్కడి నుంచి తప్పించుకునేందు ప్రయత్నించారు. కానీ స్థానికలు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలలని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. అలాగే వారు డ్రైవర్ చేసిన కారును సైతం స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2025 | 05:21 PM