Bull Charges At Former MLA: పండుగ రోజు విషాదం.. మాజీ ఎమ్మెల్యేపై ఎద్దు దాడి
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:39 PM
మాజీ ఎమ్మెల్యే బీఎన్ మహా లింగప్ప తన ఇంటి బయట నిలబడి పోటీలను చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఆయనపైకి దాడికి దిగింది. కొమ్ములతో కుమ్మి, నేలపై పడేసింది.
హోరీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. ఓ ఎద్దు మాజీ ఎమ్మెల్యేపై దాడి (Bull Charges At Former MLA) చేసింది. కొమ్ములతో కుమ్మి, రోడ్డుపై ఎత్తి పడేసింది. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ జిల్లాలోని బల్లిగావి గ్రామంలో ప్రతీ ఏటా దీపావళి తర్వాత హోరీ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ పండుగలో భాగంగా గ్రామస్తులు శిక్షణ పొందిన ఎద్దులను బాగా అలంకరిస్తారు. వాటికి కొబ్బరి ఆకులు, నగదు లేదా ఇతర బహుమతులు కడతారు.
తర్వాత వాటిని రెచ్చగొడతారు. అవి మనుషులపై దాడి చేయడానికి వచ్చినపుడు తప్పించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాటికి కట్టిన ఆకుల్ని, నగదు, ఇతర బహుమతుల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. రెండు రోజుల క్రితం బల్లిగావి గ్రామస్తులు ఎద్దుల్ని గ్రామంలోకి వదిలారు(Shivamogga Decorated Bull Incident). అవి మనుషుల వెంటపడి కుమ్ముతూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బీఎన్ మహా లింగప్ప తన ఇంటి బయట నిలబడి పోటీలను చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఆయనపైకి దాడికి దిగింది. కొమ్ములతో కుమ్మి, నేలపై పడేసింది.
ఎద్దు దెబ్బకు ఆయన కింద పడి పైకి లేవలేకపోయారు. తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఎద్దు(Decorated Bull Parade) మాజీ ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు తమ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఇవి కూడా చదవండిః
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ముస్లిం కాదు..
వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?: సజ్జనార్