Cancer cure discovery: ప్రమాదకర క్యాన్సర్‌కు మందు దొరికేసిందా.. కప్ప కడుపులోని బ్యాక్టీరియాపై ఆసక్తికర పరిశోధన..
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:29 PM
క్యాన్సర్ ఉందని తెలిస్తే చాలు.. రోగులు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. వైద్యం ఎంత ఆధునిక పుంతలు తొక్కుతున్నప్పటికీ క్యాన్సర్‌కు పూర్తి స్థాయి మందులు అందుబాటులోకి రావడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి క్యాన్సర్.
క్యాన్సర్.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి. క్యాన్సర్ ఉందని తెలిస్తే చాలు.. రోగులు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. వైద్యం ఎంత ఆధునిక పుంతలు తొక్కుతున్నప్పటికీ క్యాన్సర్‌కు పూర్తి స్థాయి మందులు అందుబాటులోకి రావడం లేదు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలితో సమస్యలు ఎందుర్కొంటున్న యువతలో కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి సాంప్రదాయ చికిత్సలు ఉన్నప్పటికీ, సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగానే ఉంటోంది (Japanese scientist cancer research).
కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో జపనీస్ శాస్త్రవేత్తలు విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే అద్భుత ఆవిష్కరణ చేశారు. ఒక చిన్న కప్ప ప్రేగులలో కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగ పడే బ్యాక్టీరియా ఉన్నట్టు కనుగొన్నారు. జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JAIST) పరిశోధకులు జపనీస్ చెట్లపై తిరిగే కప్పల గట్‌లో కనిపించే బ్యాక్టీరియాను పరిశీలించారు. జపనీస్ ట్రీ ఫాగ్స్ ప్రేగులలో ఎవిన్‌గెల్లా అమెరికానా అనే బ్యాక్టీరియా కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో మెరుగ్గా పని చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు (magical bacteria frog intestines).
ఆ బ్యాక్టీరియాను కొన్ని ఎలుకల్లోకి ప్రవేశపెట్టి పరిశోధనలు చేశారు (medical breakthrough cancer). ఆ బ్యాక్టీరియా ఎలుకల్లోని క్యాన్సర్ కణితులను పూర్తిగా మాయం చేసిందట. ఆ బ్యాక్టీరియా కారణంగా ఆరోగ్యవంతంగా మారిన ఎలుకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశ పెట్టారట. అయితే ఆ ఎలుకల్లో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయట. ఆ బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలను నేరుగా నాశనం చేస్తుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోందట. కీమోథెరపీతో పోల్చుకుంటే ఈ బ్యాక్టీరియాతో చేసే చికిత్స చాలా సురక్షితమైనదని భావిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువని చెబుతున్నారు. ఈ వైద్య విధానంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..