Viral: మద్యం మత్తులో అలా కూడా చేస్తారా.. ఆరు నెలల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళితే..
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:08 PM
మద్యం మత్తులో అతడు చేసిన ఓ పని అతడిని హాస్పిటల్‌లో పడేసింది. అసలు మద్యం మత్తులో తనేం చేశాడో తెలుసుకోవడానికి అతడికి తెలియడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా మద్యం మత్తులో (Drunken) ఉన్న కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తారు. కిక్ ఎక్కి స్పృహ కోల్పోయిన తర్వాత వారేం చేస్తున్నారో వారికి అర్థం కాదు. తాజాగా చైనా (China)లో ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు. మద్యం మత్తులో అతడు చేసిన ఓ పని అతడిని హాస్పిటల్‌లో పడేసింది. అసలు మద్యం మత్తులో తనేం చేశాడో తెలుసుకోవడానికి అతడికి తెలియడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Chinese Man Swallows Spoon).
చైనాకు చెందిన యాంగ్ ఆరు నెలల క్రితం జనవరిలో థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లాడు. హోటల్ గదిలో కూర్చుని విపరీతంగా మద్యం సేవించాడు. మద్యం డోస్ బాగా ఎక్కువ అయిపోవడంతో వాంతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాఫీ స్పూన్ (Spoon)తో వాంతి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ స్పూన్ జారిపోయి గొంతు నుంచి కడుపులోకి వెళ్లిపోయింది. మద్యం మత్తులో యాంగ్ ఆ విషయాన్ని మర్చిపోయి నిద్రపోయాడు. మరుసటి రోజు యాంగ్ స్పృహలోకి వచ్చినప్పుడు, అది ఒక కల అని భావించి తన పని తాను చేసుకున్నాడు. చైనాకు తిరిగి వెళ్లిపోయాడు.
స్పూన్ అతడి కడుపులోనే ఉన్నప్పటికీ ఆరు నెలల పాటు యాంగ్‌కు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. చివరకు జూన్ 18వ తేదీన అతడికి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. స్కాన్ చేసి చూస్తే అతడి కడుపులో చెంచా ఉన్నట్టు అర్థమైంది. డాక్టర్లు వెంటనే ఎండోస్కోపిక్ సర్జరీ చేసి కడుపులో ఉన్న చెంచాను తొలగించారు. రెండ్రోజుల అనంతరం యాంగ్‌ను డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఈమె పురుష ప్రపంచాన్నే భయపెడుతోంది.. ఉంగరాల ఆటలో ఆమె ఏం చేసిందంటే..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలోని రెండు తప్పులను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..