Viral Video Wins Hearts: కూతురి కోసం రూపాయి, రూపాయి కూడబెట్టి.. అదిరిపోయే గిఫ్ట్..
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:17 PM
జాష్‌పూర్ జిల్లాకు చెందిన భజరంగ్ రామ్ భగత్‌కు కొంత పొలం ఉంది. ఉన్న కొద్దిపాటి పొలం చేసుకుంటూ, కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం అతడి కూతురు చంపా స్కూటీ కావాలని భజరంగ్ రామ్‌ను అడిగింది.
‘నాన్న ఎందుకో వెనుకబడ్డాడు’ అన్నట్లు.. ఈ సమాజంలో తల్లి ప్రేమకు ఉన్నంత విలువ తండ్రి ప్రేమకు ఉండదు. చాలా సందర్భాల్లో తండ్రి చేసే త్యాగాలకు కూడా గుర్తింపు ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ తండ్రి తన కూతురి కోసం ఏడు నెలల కష్టాన్ని ఖర్చు చేసేశాడు. కూతురికి స్కూటీ కొనివ్వాలనుకున్న ఆ వ్యక్తి రూపాయి, రూపాయి కూడబెట్టాడు. చిల్లర డబ్బులతోటే కూతురికి స్కూటీని బహుమతిగా కొనిచ్చాడు.
ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జాష్‌పూర్ జిల్లాకు చెందిన భజరంగ్ రామ్ భగత్‌కు కొంత పొలం ఉంది. ఉన్న కొద్దిపాటి పొలం చేసుకుంటూ, కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం అతడి కూతురు చంపా స్కూటీ కావాలని భజరంగ్ రామ్‌ను అడిగింది. అయితే, స్కూటీ కొనేంత డబ్బు తన దగ్గర లేకపోవటంతో కొన్ని నెలలు ఆగమని చెప్పాడు. స్కూటీ కొనడానికి ప్రతీ రోజూ కొంత డబ్బు దాచిపెట్టసాగాడు.
చిల్లర రూపంలోనూ డబ్బులు దాచాడు. 7 నెలల్లో లక్ష రూపాయల దాకా పోగు చేశాడు. ఈ లక్ష రూపాయల్లో.. రూపాయి కాయిన్స్ రూ.40వేల దాకా ఉన్నాయి. మిగిలినవి మొత్తం నోట్లు. ఇక, ఆ డబ్బుల్ని తీసుకుని భజరంగ్ తన కూతురు, భార్యతో కలిసి షోరూముకు వెళ్లాడు. ఆ చిల్లర డబ్బుల్ని చూసి షోరూము సిబ్బంది మొదట ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిసిన తర్వాత ఎంతో సంతోషించారు. నోట్లతోపాటు చిల్లర డబ్బుల్నీ తీసుకుని స్కూటీ అమ్మారు. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా స్కూటీతోపాటు ఓ మిక్సీని కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
డ్రగ్స్ మత్తులో అలజడి సృష్టించిన భారతీయుడు.. అమెరికాలో ముగ్గురు మృతి
మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం: రామ్మోహన్ నాయుడు