Share News

Indian Origin Truck Driver: డ్రగ్స్ మత్తులో అలజడి సృష్టించిన భారతీయుడు.. అమెరికాలో ముగ్గురు మృతి

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:13 PM

జషన్‌ప్రీత్ నడుపుతున్న ట్రక్ బీభత్సం సృష్టించింది. శాన్ బెర్నార్డినో కౌంటీ హైవేపై ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. కార్లతో పాటు ఇతర పెద్ద వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.

Indian Origin Truck Driver: డ్రగ్స్ మత్తులో అలజడి సృష్టించిన భారతీయుడు.. అమెరికాలో ముగ్గురు మృతి
Indian Origin Truck Driver

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన ఓ భారతీయుడు డ్రగ్స్ మత్తులో హైవేపై బీభత్సం సృష్టించాడు. ట్రక్‌తో వాహనాలను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 21 ఏళ్ల జషన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి ట్రక్ డ్రైవర్‌గా పనికి కుదిరాడు. 2022 మార్చి నెలలో కాలిఫోర్నియాలో మొదటి సారి పోలీసులకు దొరికిపోయాడు.


అయితే, బైడెన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ పాలసీ కారణంగా కొన్ని రోజులకే పోలీసుల నిర్బంధం నుంచి బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ట్రక్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. జషన్‌ప్రీత్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డ్రగ్స్ తీసుకునే ట్రక్ నడిపేవాడు. రెండు రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని ట్రక్ నడపటం మొదలెట్టాడు. అయితే, మత్తు కారణంగా ఊహించని దారుణం జరిగింది. అతడు నడుపుతున్న ట్రక్ బీభత్సం సృష్టించింది.


శాన్ బెర్నార్డినో కౌంటీ హైవేపై ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. కార్లతో పాటు ఇతర పెద్ద వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జషన్‌ప్రీత్ కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జషన్‌ప్రీత్‌కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై నిలబడి..

నడి రోడ్డుపై రెచ్చిపోయిన నటి.. టపాసుల షాపులోంచి..

Updated Date - Oct 23 , 2025 | 05:35 PM