Share News

Cheetah hunting speed: చిరుత వేట ఎలా ఉంటుందో చూశారా.. 3 సెకెన్లలో 100 కి.మీ. వేగంతో..

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:20 AM

ఈ భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. చిరుతతో పోటీ పడి పరిగెత్తే జంతువు మరకొటి లేదు. వేటాడే సమయంలో చిరుత వేగం అద్వితీయం. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయి వేటాడగలదు.

Cheetah hunting speed: చిరుత వేట ఎలా ఉంటుందో చూశారా.. 3 సెకెన్లలో 100 కి.మీ. వేగంతో..
cheetah hunting speed

ఈ భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. చిరుతతో పోటీ పడి పరిగెత్తే జంతువు మరకొటి లేదు. వేటాడే సమయంలో చిరుత వేగం అద్వితీయం. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోయి వేటాడగలదు. చిరుత వేటకు సంబంధించిన అద్భుతమైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి అవాక్కవుతున్నారు (fastest land animal).


@TheeDarkCircle అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిరుత దూరంగా ఉన్న ఓ జింకను వేటాడాలని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. కేవలం 3 సెకెన్ల వ్యవధిలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా స్పోర్ట్స్ కార్లు కూడా అంత తక్కువ వ్యవధిలో అంత వేగాన్ని అందుకోలేవేమో. కెమెరా కూడా ఆ చిరుత కదలికలను పూర్తిగా పట్టుకోలేకపోయిందంటే వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు (cheetah acceleration).


మొత్తానికి ఆ చిరుత తను టార్గెట్ చేసిన జింకను పట్టేసుకుంది (cheetah vs sports car). ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 92 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియో అద్భుతంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఇంత వేగంగా పరిగెత్తే మరో జంతువు భూమి మీద లేదని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఈమెకేమైంది.. వేగంగా వెళ్తున్న రైలు డోర్ దగ్గర నిల్చుని ఏం చేసిందంటే..

చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2025 | 11:20 AM