Employees Breakup Leave: బ్రేకప్ లీవ్స్ కోరిన ఉద్యోగి.. యజమాని ఏం చేశాడంటే..
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:11 PM
బ్రేకప్ బాధతో ఓ వ్యక్తి ఆఫీస్ వర్క్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. బ్రేకప్ సెలవులు కావాలంటూ బాస్‌కు మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్ చూసిన బాస్ ఏం చేశాడంటే..
ప్రేమించిన వారికి దూరం అయినపుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ తెలీదు. ప్రేమలో విఫలమై ప్రాణాలు తీసుకున్న వారు లేకపోలేదు. బ్రేకప్ బాధలో ఉన్నపుడు ఏ పనీ చేయాలనిపించదు. తిండి కూడా సరిగా తినాలనిపించదు. ఉద్యోగం చేసే వారి పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. సెలవులు దొరకక.. పని మీద ఫోకస్ చేయలేక నరకం చూడాల్సి వస్తుంది.
ఇలాంటి సమయంలోనే కొంతమంది ఉద్యోగం మానేస్తుంటారు. అత్యంత అరుదుగా మాత్రమే ఉద్యోగి బాధను అర్థం చేసుకుని బాస్‌లు లీవ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి నాట్ డేటింగ్ అనే సంస్థలో పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి బ్రేకప్ అయింది. బ్రేకప్ బాధతో పని చేయలేకపోయాడు. సెలవులు కావాలంటూ సీఈఓ జశ్వీర్ సింగ్‌కు మెయిల్ పెట్టాడు.
ఆ మెయిల్‌లో.. ‘ఈ మధ్యే నాకు బ్రేకప్ అయింది. నేను పని మీద ఫోకస్ చేయలేకపోతున్నా. నాకు చిన్న బ్రేక్ కావాలి. నేను ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా.. నాకు 28వ తేదీనుంచి 8వ తేదీ వరకు లీవ్ కావాలి’ అని రాశాడు. జశ్వీర్ ఆ ఉద్యోగి బాధను అర్థం చేసుకున్నాడు. అతడు అడిగినన్ని రోజులు లీవ్ ఇచ్చాడు. తర్వాత మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
బెంగళూరులో బంగ్లాదేశ్ వ్యక్తి దారుణం.. గుడిలోకి ప్రవేశించి..